Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
కార్డియాక్ ఎన్ లార్జ్ మెంట్ అంటే ఏమిటి?

కార్డియాక్ ఎన్ లార్జ్ మెంట్ - కార్డియాక్ ఎన్ లార్జ్ మెంట్ అంటే గుండె యొక్క పరిమాణం పెరగడం అన్నమాట. ఇందులో ప్రధానంగా రెండు రకాలున్నాయి. అవి 1 హైపర్ ట్రోఫీ 2 డైలేషన్ గా చెప్పబడతాయి. ఈ రెండూ సాధారణంగా విడివిడిగా సంభవించినా ఒక్కొక్కసారి కలిపి కూడా రావచ్చు. హైపర్ ట్రోఫీ గుండె యొక్క కండరం పెరగడంలో కీలక పాత్ర వహిస్తుంది. డైలేషన్ గుండెలోపల గది యొక్క పరిమాణం పెరగడంతో కీలక పాత్ర వహిస్తుంది. హైపర్ ట్రోపీ గుండెలోని ఒక గదిలో మాత్రమే సంభవిస్తే డైలేషన్ వ్యాధి పరిస్ధితి బట్టి ఒకటి నుండి అన్ని గదులలో సంభవిస్తుంది.
కార్డియాక్ హైపర్ ట్రోపీ - ఈ హైపర్ ట్రోపీ అంటే గుండెయొక్క కండరం పెరగడం అనేది ప్రధానంగా గుండె మీద ఒత్తిడి పెరగడం వలన సంభవిస్తుంది. గుండెలోని క్రింది గదులయిన జఠరికలలో ఇది సంభవిస్తుంది. కుడి జఠరికలు రక్తాన్ని ఊపిరితిత్తులకు, ఎడమ జఠరికలు రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంటాయి. అయితే రక్తపోటు పెరగడం వలన ఊపిరితిత్తులకు, లేదా శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అయ్యే రక్తంలో ఒత్తిడి పెరిగి అది మామూలు కన్నా వేగంగా ప్రసరించడం వలన జఠరికలలో ఒత్తిడి కలిగి అవి పరిమాణంలో పెద్దవవుతాయి. ఎడమ జఠరిక పరిమాణం పెరగడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటే. కొన్నిసార్లు గుండెలోని ప్రధాన వాల్వ్ ఒక్కోసారి తెరచుకోకపోవడం కూడా ఈ ఎడమ జఠరిక పరిమాణం పెరగడానికి ప్రధాన కారణం.
అంతే కాకుండా హైపర్ ట్రోపిక్ కార్డియోమయోపతి అనే జన్యు సంబంధిత వ్యాధి కూడా ఈ ఎడమ జఠరిక పరిమాణం పెరిగేందుకు ప్రధాన కారణం. ఇక కుడి జఠరిక పరిమాణం పెరగడానికి కారణంగా కొన్ని ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను చెప్పవచ్చు. ఈ వ్యాధుల వల్ల ఊపిరితిత్తులలోని రక్తనాళాలు దెబ్బతిని మిగిలిన రక్తనాళాలపై అధిక ఒత్తిడిని కలుగజేస్తాయి. వీటి పెరుగుదలకు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
కార్డియాక్ డైలేషన్ - ఈ కార్డియాక్ డైలేషన్ కు ప్రధాన కారణం గుండెలోని కండరాన్ని దెబ్బతీసే కారకాలే. కొన్ని రకాల కాన్సర్ సంబంధిత వ్యాధులు, కోకైన్ వంటి మత్తు పదార్ధాలు వాడటం, హెచ్.ఐ.వి. వ్యాధి ట్రీట్ మెంట్ కు ఉపయోగించే కొన్ని మందులు కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ కార్డియాక్ డైలేషన్ ధైరాయిడ్ వ్యాధివల్ల కూడా వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications