Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.!
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు క్రేవింగ్స్ విపరీతంగా ఉండటం సర్వసాధారణం. ఎప్పటిలా కంటే ఎక్కువ సార్లు, ఎక్కువగా తినాలని అనిపించడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువవుతూ ఉంటుంది. అయితే గర్భిణీలకు తినాలనిపించిన ప్రతిదీ తినడం కరెక్టేనా అంటే కాదని అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. గర్భధారణ సమయంలో కొన్ని తినాలనిపించినా తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. మరి ఈ సమయంలో ఎందుకు క్రేవింగ్స్ పెరుగుతాయి.. ఏం తినాలి, ఏం తినకూడదు ఇక్కడ చూద్దాం..

గర్భిణీల్లో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్, హెచ్‌సీజీ హార్మోన్ల స్థాయిల్లో మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటాయి. ఫలితంగా ఆకలి, రుచి, వాసనను నియంత్రించే మెదడు భాగాలు ప్రభావితం అవుతాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు తీపి ఉప్పు, మసాలా పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువవుతుంది. అదేవిధంగా పిండం అభివృద్ధికి దోహదపడే ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు అవసరమవుతాయి. ఈ క్రమంలో వీటి లోపం కారణంగా అందుకు సంబంధించిన పదార్థాలు తినాలనే కోరిక ఎక్కువవుతుంది.
గర్భధారణ సమయంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ మరియు హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ వంటి హార్మోన్ల స్థాయిలలో వేగవంతమైన మార్పులు వస్తాయి. ఇవి ఆకలి, రుచి మరియు వాసనను నియంత్రించే మెదడు భాగాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల, కొన్నిసార్లు తీపి, ఉప్పు లేదా మసాలా పదార్థాలు తినాలనే కోరికలు కలగవచ్చు. అంతేకాకుండా, పిండం అభివృద్ధికి శరీరానికి ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా అవసరం.
ప్రతీ క్రేవింగ్స్ తీర్చుకోవాలా..
ప్రెగ్నెన్సీ సమయంలో మెటబాలిజం, రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు వస్తుంటాయి. జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్, చిప్స్, స్పీట్లు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తరుచూ తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. దీంతో ప్రెగ్నెన్సీ డయాబెటిస్, హై బీపీ, ప్రసవ సమస్యలు ప్రమాదం పెరుగుతుంది. వీటిని తినడం వల్ల పోషక పదార్థాలు తీసుకునే అవకాశం తగ్గి తల్లీబిడ్డ ఇద్దరిలో న్యూట్రియెంట్ లోపానికి దారితీస్తుంది. చాక్లెట్ తినాలనే కోరిక మెగ్నీషియం లోపాన్ని సూచిస్తుంది. అధిక సాల్ట్ పదార్థాలు సోడియం లోపాన్ని, సుద్ద ముక్కలు, ఐస్‌క్రీమ్‌లు తినాలనే కోరిక ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. ఇలాంటి కోరికలు కలిగినప్పుడు వీటికి ప్రత్యామ్నాయం కోసం వైద్యుల సలహా తీసుకోవాలి. అందుకే క్రేవింగ్స్ సరైన అర్థాన్ని తెలుసుకుని శరీరానికి అవసరమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మేలు చేస్తుంది.

క్రేవింగ్స్‌లో ఇవి తినండి…
గర్భిణీలకు క్రేవింగ్స్ మొదలైనప్పుడు వాటిని అణచివేయకుండా బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. జంక్ ఫుడ్ లాంటి డేంజరస్ ఆహారానికి బదులుగా పండ్లు, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, తేనె వంటి సహజ పదార్థాలను తీసుకోండి. పూల్ మఖానా, నట్స్, వేయించిన పల్లీలు వంటివి మేలు చేస్తాయి. వీటిని రోజంతా సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి.
అదేవిధంగా డాక్టర్ సలహా మేరకు సరైన మోతాదులో నీరు తీసుకోవడం, తేలికపాటి వ్యాయామం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర సప్లిమెంట్స్ తీసుకోవడం అవసరం. వారి సలహా మేరకు డైట్ చార్ట్ పాటించండి. మీ ఆరోగ్యం, గర్భధారణ దశను బట్టి క్రేవింగ్స్ అవసరాలను అర్థం చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
