Latest Updates
-
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.!
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా బాహ్య శరీరంపైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మహిళలు ఒక్కసారిగా బరువు తగ్గినా లేదా డెలివరీ అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ పడిపోతుంటాయి. అయితే వీటిని తొలగించేందుకు కొందరు కాస్మెటిక్ సర్జరీలు, లేదా రసాయనాలు ఎక్కువగా ఉన్న ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇలా వీటిని ఉపయోగించడం మున్ముందు మహిళల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. అయితే ఇలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా మీరు ఈ స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్టుకోవచ్చు.

కలబంద
కలబంద సహజసిద్ధమైన ప్రకృతి అందించిన వరం. ఇది చర్మానికి సంబంధించి చాలా సమస్యలకు పరిష్కారంలా ఉంటుంది. శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అలోవెరా గుజ్జుతో మర్దనా చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా తరచుగా చేయడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ తగ్గడం లేదా చారలు పలుచబడి చర్మంలో కలిసిపోయి మీ స్కిన్‌ను స్మూత్‌గా చేస్తాయి.

కోడిగుడ్లతో ముడతలు మాయం
కోడిగుడ్డులోని పచ్చ సొనను బాగా గిలక్కొట్టి, అందులో నిమ్మరసం, రెండు స్పూన్ల ఓట్ మీల్, అంతే కొలతతో ఆల్మండ్ పేస్ట్, కొన్ని పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేయడం ద్వారా త్వరలోనే ఫలితం కనిపిస్తుంది. చారలు లేని చర్మం మీ సొంతం అవుతుంది. ప్రతిసారి రెండు కోడిగుడ్లను ఉపయోగిస్తే సరిపోతుంది.
కోకోవా బటర్‌తో చారలు మాయం
చర్మ సౌందర్యానికి కోకోవా బటర్ అద్భుతమైన పరిష్కారం. రాత్రిపూట పడుకునే ముందు చారలు ఉన్న చోట దీనిని తరచూ అప్లై చేయడం ద్వారా కొంతకాలానికి అవి మాయమైపోతాయి.

యాప్రికాట్ మాస్క్, ఆయిల్
రెండు లేదా మూడు యాప్రికాట్లను తీసుకుని అందులో గింజలు తీసేయాలి. పండును పేస్ట్‌లా చేసి శరీరంలో స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి. నిమ్మరసంతో కలిపి ప్యాక్ మాదిరిగా అప్లై చేస్తే ఇంకా ప్రభావంతంగా పనిచేస్తుంది. సమర్థవంతమైన పనితీరుతో చర్మ సంరక్షణకి దోహదపడతుంది.

ఆముదం నూనెతో నిగారింపు
సాధారణంగానే ఆముదం నూనె జుట్టుకి మంచి పోషణనిస్తుంది. కురులకు నల్లదనం, నిగారింపును ఇస్తుంది. చర్మానికి కూడా ఇదే విధంగా ఆముదం నూనె సత్ఫలితాలనిస్తుంది. గానుగ పద్ధతిలో తీసిన స్వచ్ఛమైన ఆముదం నూనెను చారలు ఉన్న చోట కొన్ని రోజులపాటు అప్లై చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
కీరా, నిమ్మలో ఎసిడిటీ గుణాలు
కీరా, నిమ్మరసంలోని విటమిన్ సి, ఎసిడిటీ గుణాలు చర్మానికి సహజ రక్షణనిస్తాయి. కీరదోసకాయ గుజ్జు, నిమ్మరసం కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ప్యాచ్ వేసినట్లయితే ఫలితం ఉంటుంది. కొన్ని రోజుల పాటు 10 నిమిషాల పాటు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చారల రంగు పలుచబడేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
