Latest Updates
-
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే?
మన ఆరోగ్యం మన చేతుల్లోనే కాదు..మన కాళ్లలో కూడా దాగి ఉందని మీకు తెలుసా? సాధారణంగా మనం హాస్పిటల్ వెళ్లగానే డాక్టర్లు ఫస్ట్ బీపీ చెక్ చేస్తారు. చేతికి ఓ పట్టీ చుట్టి, రక్తపోటు హెచ్చుతగ్గులను గమనిస్తారు. అయితే ఎప్పుడైనా మీ కాలికి బీపీ చెక్ చేయడం గురించి విన్నారా? కాలికి బీపీ చెక్ చేయడం ద్వారా మన రక్తనాళాల్లో దాగి ఉన్న బ్లాకేజ్‌లను (అడ్డంకులను) ఇట్టే పసిగట్టవచ్చు.
చేతికి, కాలికి లింక్ ఏంటి?
మన ఇంట్లో ఉండే సాధారణ బీపీ మిషన్ తోనే ఈ అద్భుతాన్ని చేయొచ్చు. చేతి దగ్గర, అలాగే చీలమండ (యాంకెల్) దగ్గర తీసుకున్న బీపీ రీడింగ్స్ ను పోల్చి చూడటం ద్వారా ధమనుల్లో ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అనే విషయాన్ని అంచనా వేయవచ్చు. అయితే దీన్ని పూర్తిగా తుది నిర్ధారణగా మాత్రం తీసుకోకూడదు. ఒక ప్రాథమిక అవగాహన కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇంట్లోనే కాలికి బీపీ ఎలా చెక్ చేయాలి?
ముందుగా మీరు ప్రశాంతంగా కూర్చుని, ఎప్పటిలాగే మీ చేతిపై బీపీ ఎంత ఉందో చెక్ చేసుకోండి. కచ్చితత్వం కోసం రెండుసార్లు చెక్ చేసి ఆ రీడింగ్ ను ఒక పేపర్‌పై రాసుకోండి. ఆ తర్వాత అదే బీపీ కఫ్ ను మీ కాలి చీలమండకు కొద్దిగా పైభాగంలో చుట్టి, మిషన్ ఆన్ చేయండి. ఇప్పుడు కాలి దగ్గర వచ్చిన బీపీ రీడింగ్ ను కూడా జాగ్రత్తగా నమోదు చేసుకోండి.

అసలు లెక్క ఇక్కడే ఉంది
బీపీ మిషన్ లో పైన ఉండే నంబర్ ను సిస్టోలిక్ అని, కింద ఉండే నంబర్ ను డయాస్టోలిక్ అని అంటారు. ఈ బ్లాకేజ్ పరీక్ష కోసం మనం కేవలం పైన ఉండే నంబర్ (సిస్టోలిక్) మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కాలి దగ్గర వచ్చిన పై నంబర్ ను, చేతి దగ్గర వచ్చిన పై నంబర్ తో భాగించాలి.
రిజల్ట్ ఏం చెబుతోంది?
ఈ చిన్న లెక్క ద్వారా వచ్చే సమాధానం మీ గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని స్పష్టం చేస్తుంది.
1.0 నుంచి 1.3 మధ్య వస్తే: మీ రక్తనాళాలు ఆరోగ్యంగా, సాధారణ స్థితిలో ఉన్నట్లు లెక్క.
1.4 కంటే ఎక్కువగా వస్తే: ఇది కాస్త జాగ్రత్తపడాల్సిన విషయం. రక్తనాళాలు గట్టిపడటం లేదా వాటిలో క్యాల్షియం పేరుకుపోవడం లాంటి సమస్యలు ఉండొచ్చని ఇది సూచిస్తుంది.
0.9 కంటే తక్కువగా వస్తే: ఇది కచ్చితంగా హెచ్చరిక సంకేతం. రక్తనాళాల్లో ఎక్కడో బ్లాకేజ్ ఉందని, కింది అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగట్లేదని ఇది స్పష్టం చేస్తుంది.
ఎప్పుడు డాక్టర్ ని కలవాలి
చేతిలో కంటే కాలిలో బీపీ తక్కువగా ఉంటే దాన్ని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. అలాగని రీడింగ్ నార్మల్ గా వస్తే మీ రక్తనాళాల్లో 100 శాతం ఎలాంటి బ్లాకేజ్ లేదని కూడా కన్ఫర్మ్ గా చెప్పలేం. ఈ కాలి బీపీ పరీక్ష అనేది రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే ఒక అలారం లాంటిది. కాబట్టి, మీ రీడింగ్ 0.9 కంటే తక్కువగా వచ్చినా, లేదా అసాధారణంగా అనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
