Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
గుడ్డు తింటున్నారా? ఈ పచ్చి నిజాలు మీరు తెలుపుకోవాల్సిందే!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎప్పుడైనా తినగలిగే అద్భుతమైన ఆహారం గుడ్డు. అత్యుత్తమ నాణ్యత గల ప్రోటీన్లతో పాటు విటమిన్ D, B12, సెలీనియం, జింక్ వంటి కీలక పోషకాలకు గుడ్డు కేరాఫ్ అడ్రస్. కండరాలను బలంగా మార్చాలన్నా, బరువు తగ్గాలన్నా, రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నా గుడ్డును మించిన సూపర్ ఫుడ్ మరొకటి లేదు.

అయితే, గుడ్డు ఆరోగ్యానికి మంచిది కదా అని ఇష్టమొచ్చినట్లు లాగించేస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఓ నిమిషం ఆగి ఆలోచించాల్సిందే. అమృతమైనా మితంగానే తీసుకోవాలి.. లేదంటే అనర్థాలు తప్పవని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ముఖ్య విషయం తెలుెసుకోండి
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే మన జీర్ణవ్యవస్థపై మోయలేని భారం పడుతుంది. ముఖ్యంగా మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాల ద్వారా అందాల్సిన ఫైబర్(పీచుపదార్థం) తక్కువగా ఉండి, గుడ్లు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు మొదలవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, భోజనం చేశాక కడుపు బరువుగా అనిపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
అంతేకాకుండా కొందరి శరీర తత్వానికి గుడ్లు సరిపడకపోవచ్చు. గుడ్డు తిన్న ప్రతిసారీ వికారం, కడుపు నొప్పి, లేదా చర్మంపై దద్దుర్లు వస్తుంటే.. మీకు ఎగ్ అలర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్లను సంప్రదించడం బెటర్. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కేవలం ప్రోటీన్ కోసం గుడ్ల మీదే పూర్తిగా ఆధారపడకూడదు. దీనివల్ల ఇతర ఆహారాల నుంచి శరీరానికి అందాల్సిన ముఖ్యమైన పోషకాలను మనం కోల్పోయే ప్రమాదం ఉంది.
కొలెస్ట్రాల్ ఉన్నవారు జాగ్రత్త!
రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడేవారు గుడ్ల వినియోగం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుడ్డును ఎలా వండుతున్నామనేది ఇక్కడ చాలా ముఖ్యం. గుడ్డును ఎక్కువ నూనె, వెన్న (బట్టర్), క్రీమ్, చీజ్ లేదా ప్రాసెస్ చేసిన మాంసంతో కలిపి వండితే అందులో ప్రమాదకరమైన సంతృప్త కొవ్వులు చేరిపోయి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి.

ఎవరు, ఎన్ని తినాలి?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలనేది మన వయసు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యవంతమైన పెద్దలు: వారానికి 3 నుంచి 4 సార్లు, రోజుకు ఒక గుడ్డు చొప్పున ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు: ఎదుగుతున్న పిల్లలకు రోజుకో గుడ్డు ఇస్తే వారి శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
గుండె సమస్యలు ఉన్నవారు: వీరు డాక్లర్ల సలహా మేరకు వారానికి మహా అయితే మూడు గుడ్లకు పరిమితం కావడం చాలా మంచిది.
ఎలా తింటే బెస్ట్?
గుడ్డును వండుకోవడం కూడా ఒక ఆర్ట్. ఎక్కువ నూనె, మసాలాలు దట్టించి ఆమ్లెట్లు వేసుకోవడం కంటే.. నీళ్లలో ఉడకబెట్టిన గుడ్డు , పోచ్డ్ ఎగ్ లేదా చాలా తక్కువ నూనెతో చేసే స్క్రాంబుల్డ్ ఎగ్ తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. ఉడకబెట్టిన గుడ్డును రంగురంగుల కూరగాయలు, సలాడ్స్ తో కలిపి తీసుకుంటే శరీరానికి సమతుల్యమైన పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
