Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
పొగతాగితే ఇద్దరిలో సంతానలేమి సమస్య.. హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
సిగరెట్ తాగడం ప్రస్తుతం చాలా సాధారణమైన విషయం. ఇప్పుడు మగవారితో పాటు ఆడవాళ్లు కూడా పోటీపడి తాగుతున్నారు. దేశంలో గత 25 సంవత్సరాల నుంచి సిగరెట్లు పీల్చే ఆడివారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. సిగరెంట్ కూడా ఫ్యాషన్‌గా కొనసాగుతున్న పరిస్థితిలో దానివల్ల అటు పురుషులు ఇటు స్త్రీలు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
సంతానలేమి సమస్య చాలా మంది పురుషులు స్త్రీలలో చూస్తున్నాం. పురుషుల్లో స్పర్మ్ కౌంట్, మహిళల్లో కొన్ని రకాల సమస్యల వల్ల సంతానం కావడం లేదు. పొగాకులో వుండే నికోటిన్, టార్, కార్బన్ మోనోక్సైడ్ సంతానలేమికి ప్రధాన కారకాలుగా మారుతున్నాయని పరిశోధకులు నిర్ధారించారు.

ఇక మహిళల్లో ఈ నికోటిన్, అండం తయారు కాకుండా, ఉత్పత్తి కాకుండా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నారు. అండం ఉత్పత్తి అయినా అవి ఆరోగ్యంగా వుండవని అంటున్నారు. రుతు స్రావం కూడా క్రమ పద్ధతిలో వుండదు. ఇలాంటి పరిస్థితి మహిళల్లో వుంటే గర్భధారణ సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటారని చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయంటున్నారు. గర్భం దాల్చినా అబార్షన్ అయ్యే అవకాశం, లేదా బిడ్డ అనారోగ్యంగా తక్కువ బరువుతో పుట్టడం జరుగుతుంది.
పురుషుల్లో వీర్య కణాల్లో నాణ్యత బాగా తగ్గుతుంది. పొగాకు వీర్యానికి సంబంధించిన రూపు రేఖలపై దెబ్బ కొటుతుంది. నికోటిన్ వల్ల విడుదలయ్యే విషపదార్ధాలు వీర్య కణాలను బలహీనంగా మార్చివేస్తాయ్. ఇది క్రమంగా పురుషుల్లో సంతానలేమికి దారి తీస్తుంది.
సిగరెట్ తాగడం వల్ల పురుషాంగం పటుత్వాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. పురుశాంగానికి రక్తాన్ని సరఫరా కానివ్వకుండా చేయడం వల్ల మొత్తం సంతానలేమి సమస్యలను సృష్టిస్తుంది. పొగతాగడం వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు ఇలాంటి సంతానలేమి సమస్యలను కూడా తెచ్చపెడుతుంది.
భారత దేశంలో ప్రస్తుతం పొగతాగేవారి శాతం 27 శాతానికి పైగా వుంది. అంటే భారత దేశజనాభా 140 కోట్ల మందిలో 35 కోట్ల మందికి పైగా పొగతాగుతున్నారు. దేశంలో పొగతాగే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే వస్తుంది. మహిళల్లో కూడా పొగతాగేవారి సంఖ్య పెరుగుతోంది. సంతానలేమి సమస్యలు కూడా రోజురోజుకూ పెరిగిపోతూనే వున్నాయ్.
పొగతాగే అలవాట్లను తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా మానివేయొచ్చు. పొగతాగడం ఆపివేయడానికి ఇక్కడ మేము మీకు కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.
ఒత్తిడిని తగ్గించుకోండి : చాలా మంది వత్తిడిని తగ్గించుకోవడానికి పొగతాగుతుంటారు. భావోద్వేగాలను మీకు మీరే కంట్రోల్ చేసుకోవాలి. పొగతాగడానికి బదులుగా మెడిటేషన్ చేసుకుంటే మాసనిక ఒత్తిడి తగ్గుతుంది.
గత అనుభవా నుంచి నేర్చుకోండి. ఇప్పటి వరకు పొగతాగడం వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలన్నింటిని ఒక సారి స్మరించుకోండి. వీటి వల్ల మీకు కలిగిన నష్టాన్ని తలుచుకుంటే త్వరగా పొగతాగడాన్ని వదిలివేస్తారు.
మీరు పొగతాగడం ఆపివేస్తున్నట్లు మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు తెలియజేయండి. దీని వల్ల మీరు పొగతాగకుండా వారి సహకారాన్ని కూడా అందుకునే అవకాశం వుంది.
రోజుకు 4 సిగరెట్లు గనక మీకు తాగే అలవాటు వుంటే దానికి ఒక్క సిగరెట్‌కు తగ్గించుకోవాలి. రోజుకు ఒక్క సిగరెట్ తాగే అలవాటు వుంటే రెండ లేదా మూడు రోజులకు ఒకటి తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
