Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి?
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భయానకంగా పెరుగుతోంది. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే గుండె జబ్బులు, ఇప్పుడు పాతికేళ్ల యువతను కూడా బలితీసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. మన ఆధునిక, అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol) అమాంతం పెరిగిపోవడమే.

ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) శాతాన్ని పెంచుకోవడం అత్యంత ఆవసరం. అసలు మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? అది ఏం చేస్తుంది? దానిని ఎలా పెంచుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.
హెచ్ డీఎల్ (HDL) కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?
సాధారణంగా కొలెస్ట్రాల్ అనగానే అందరూ భయపడతారు. కానీ అందులో మంచిది కూడా ఉంటుంది. దానినే HDL (High Density Lipoprotein) అంటారు. ఇది రక్తంలో తేలియాడే ఒక ప్రోటీన్-కొవ్వు అణువుల సమ్మేళనం. గుండెను కాపాడే ఈ కొలెస్ట్రాల్ ను వైద్య పరిభాషలో చెత్త ట్రక్కు అని కూడా పిలుస్తారు. దీనిలో ఉండే అపోలిపోప్రొటీన్లు (A, A1, A2) రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే దీనిని మంచి ప్రోటీన్ అని కూడా అంటారు.
ఇది శరీరంలో ఏం చేస్తుందంటే?
మంచి కొలెస్ట్రాల్ మన ధమనుల గుండా నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రక్తనాళాల గోడలకు అంటుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను, అదనపు ఫలకాలను ఒక చెత్త ట్రక్కులాగా తనలోకి సేకరించుకుంటుంది. ఆ చెత్తను నేరుగా లివర్ కు తీసుకువెళుతుంది. లివర్ ఆ చెడు కొవ్వును విచ్ఛిన్నం చేసి శరీరం నుండి సులభంగా బయటకు పంపేస్తుంది. తద్వారా రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి?
వైద్య నిపుణుల ప్రకారం.. మన శరీరంలో ఉండే మొత్తం కొలెస్ట్రాల్ లో మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడూ నాలుగో వంతు(1/4th) ఉండాలి. ఉదాహరణకు..మీ మొత్తం కొలెస్ట్రాల్ 200 ఉంటే, అందులో మంచి కొలెస్ట్రాల్ (HDL) కనీసం 50 కంటే ఎక్కువగా ఉండాలి. అదే మీ మొత్తం కొలెస్ట్రాల్ 100 ఉంటే, మంచి కొలెస్ట్రాల్ 25 ఉండాలి.
అంటే మనం కొలెస్ట్రాల్ ను కేవలం ఒక సంఖ్యగా చూడకూడదు, మొత్తం కొలెస్ట్రాల్ కు, మంచి కొలెస్ట్రాల్ కు మధ్య ఉన్న నిష్పత్తిని సరిచూసుకోవాలి.
మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడం ఎలా?
మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు, మన దైనందిన జీవితంలో కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే చాలు.
నడక తప్పనిసరి: రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు చురుగ్గా నడవండి
ఆకుకూరలు తినండి: మీ రోజువారీ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి.
నూనె వాడకం తగ్గించండి: వంటల్లో నూనె వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి. జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.
వ్యసనాలకు దూరం: స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను దారుణంగా తగ్గిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
