Latest Updates
-
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు -
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే! -
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్ -
ఫైబర్ ఎక్కువ, ఆయిల్ తక్కువ.. కడుపుకు హాయినిచ్చే చౌ చౌ క్యారెట్ కూటు..చపాతీ,పూరీల్లోకి కిర్రాక్ టేస్ట్ -
సెర్బియా ఎన్నికల్లో జెన్ జీ సంచలనం..విద్యార్థుల ఆందోళన దెబ్బకి కుప్పకూలిన ప్రభుత్వం.. -
మాంసాహారాన్ని మించే రుచితో స్పైసీ సోయా చుక్కా..రైస్, చపాతీ, దోశలోకి బెస్ట్ సైడ్ డిష్ -
మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి -
జస్ట్ 5 నిమిషాల్లో టేస్టీ ఎగ్ పరోటా..ఈజీగా చేసుకోండిలా -
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం!
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు..
అట్లతద్ది అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అట్లు. రోజంతా ఉపవాసనం ఉండి సాయంత్రం గౌరీ దేవికి పూజ చేసి 11 అట్లు గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు. చంద్రోదయం తర్వాత ఇరుగుపొరుగువారికి లేదా ముత్తైదువులకు వాయనంగా అట్లు ఇస్తారు. అయితే ఈ అట్లు సాగుతున్నట్లు కాకుండా దూదిలా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటేనే పండగ పూట తినడానికి, వాయనంగా ముత్తైదువులకు ఇవ్వడానికి బాగుంటాయి. దూదిల మెత్తగా అట్లతద్ది అట్లు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపగుళ్లు
-తడి బియ్యం పిండి(వరిపిండి)
-ఉప్పు
-నీళ్లు
-నూనె(దోశ కాల్చుకోడానికి)

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాసు మినపగుళ్లు వేసి తగినన్ని నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు త్వరగా నానాలంటే అందులో ఇనుప అట్ల కాడ వేయండి.
-పప్పు బాగా నానిన తర్వాత నీళ్లు వంపేసి, మరోసారి అందులో నీళ్లు పోసి పప్పుని శుభ్రంగా కడుక్కోండి.
-ఇప్పుడు గ్రైండర్ లేదా మిక్సీలో నానిన మినపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండికి ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగా ఉండాలి, మరీ లూజ్ అవ్వకూడదు, బాగా నలిగి మెత్తగా ఉంటే సరిపోతుంది.
-గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఈ అట్లకు తడి బియ్యం పిండి(వరి పిండి) వేసి కలుపుతారు. అట్లు మెత్తగా వస్తాయని తడి బియ్యం పిండి వేస్తారు. కాబట్టి మరో గిన్నెలో 1 గ్లాసు మినపప్పు కొలత ఉంటే 2 గ్లాసుల వరి పిండి తీసుకోవాలి. ఈ వరిపిండిలో గ్లాసుంబావు వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్ గా ఉండకూడదు.
-కలుపుకున్న వరిపిండిని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. వరిపిండిని నేరుగా మినప్పిండిలో వేసి కలపకూడదని గుర్తుంచుకోండి..మరో గిన్నెలో వేసి కలుపుకున్నాక అప్పుడు దాన్ని మినప్పిండిలో వేసి కలుపుకోవాలి.
-కలుపుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుని మూతపెట్టి కొన్ని గంటల పాటు వదిలిస్తే పిండి బాగా పులుస్తుంది. తర్వాత గరిటతో కలుపుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోండి. నీళ్లు కొంచెం చాలు ఎక్కువ వద్దు. పిండి మరీ లూజ్ గా ఉండకూడదు, కొద్దిగా చిక్కగానే ఉండాలి.
-తర్వాత అట్లు వేసుకోండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి. పెనం వేడయ్యాక దాని మీద అట్లు వేసుకోండి.మందంగా, చిన్నగా వేసుకోండి. నూనె వేసి రెండు వైపులా మరీ ఎర్రగా కాల్చుకోకూడదు, లైట్ గా కాలితేనే మెత్తగా ఉంటాయి. ఇదేవిధంగా మిగతా అన్ని అట్లు వేసుకోండి.
-అంతే అట్లతద్ది అట్లు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
