Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మార్కెట్ లో దొరికే జున్ను నిజమైనదో,నకిలీదో ఎలా తెలుస్తుంది? ఈ సులభమైన మార్గాన్ని ట్రై చేయండి
ఈ రోజుల్లో గుండుసూది నుంచి అణుబాంబు తయారుచేయడానికి వాడే పదార్థాల వరకు మార్కెట్ లో ప్రతిదీ దొరుకుతుంది. మార్కెట్ లో దొరకని నిత్యవసర వస్తువు అంటూ ఏదీ లేదు. అయితే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కల్తీ అవుతుంది. అది పాలు అయినా పెరుగు అయినా తినే ఆహారం,వాడే నూనె అయినా ఇలా ప్రతిదాంట్లో కల్తీ జరుగుతుంది. దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా కల్లీ ఎక్కువగా జరిగేవాటిల్లో జున్ను కూడా ఒకటి. జున్ను పేరుతో కొందరు మార్కెట్ లో షాపులలో నకిలీ జున్నుని అమ్ముతుండటం ఆందోళనకరమైన విషయం. మార్కెట్లో నకిలీ జున్ను అందుబాటులో ఉండటంతో.. ఏది నిజమైనదో,ఏది నకిలీదో గుర్తించడం చాలామందికి కొంచెం కష్టంగా మారుతోంది.
జున్ను అనేది ఆవు లేదా గేదె..దూడ పుట్టిన తర్వాత మొదటి 3-4 రోజులు ఇచ్చే చిక్కటి పాలు. ఈ పాలు సాధారణ పాల కంటే భిన్నంగా ఉంటాయి. ఇది ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. జున్నులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు కూడా ఉంటాయి. జున్ను కొనేటప్పుడు దాని రంగు, వాసన, ఆకృతిని జాగ్రత్తగా పరిశీలించండి. విశ్వసనీయమైన దుకాణాలలో మాత్రమే జున్ను కొనండి. తక్కువ ధరకు లభించే జున్ను విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్యాక్ చేసిన జున్ను కొనేటప్పుడు FSSAI గుర్తింపు గుర్తు ఉందో లేదో సరిచూసుకోండి. ప్రస్తుతం షాపుల్లో,మార్కెట్ లో లభించే జున్ను ఒరిజినలా లేకా కల్తీదా అని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూడండి.

ఇలా ఈజీగా గుర్తించండి
-నిజమైన జున్ను చేతులతో విరిచినా సులభంగా విరిగిపోతుంది. అయితే నకిలీ జున్ను మాత్రం రబ్బరులా అనిపిస్తుంది.
-నిజమైన జున్ను వేడి చేస్తే నెమ్మదిగా కరుగుతుంది. నకిలీ జున్ను వేడి చేస్తే త్వరగా కరిగిపోతుంది లేదా రబ్బరులాగా సాగుతుంది
-జున్ను వేడి చేసిన తర్వాత చల్లబరచండి. ఈ నీటిలో కొంచెం పప్పు కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచండి. నీటి రంగు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ జున్ను కల్తీ లేనిదిగా పరిగణించబడుతుంది.
-నిజమైన జున్ను సహజమైన పాల వాసన, రుచి కలిగి ఉంటుంది. తీపి, పులుపు కలగలిసిన రుచి ఉంటుంది. నకిలీ జున్ను కృత్రిమ వాసన, రుచి ఉంటుంది. కొన్నిసార్లు రసాయనాల వాసన కూడా వస్తుంది. రుచిలో తీపి ఎక్కువగా ఉంటుంది.
-ఒరిజినల్ జున్ను సహజమైన లేత పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇది మృదువుగా, మెత్తగా ఉంటుంది. నకిలీ జున్ను..కృత్రిమ రంగులు, రసాయనాలు కలపడం వల్ల రంగు అసహజంగా, కాంతివంతంగా ఉంటుంది. ఆకృతి గట్టిగా, రబ్బరులాగా ఉంటుంది.
-మీరు నిజమైన జున్ను నీటిలో ఉడకబెడితే అది అలాగే ఉంటుంది. నకిలీ జున్ను మాత్రం ముక్కలుగా విరిగిపోతుంది.
-నిజమైన జున్ను వడకట్టినప్పుడు లేత గోధుమ రంగులోకి మారుతుంది..అయితే నకిలీ జున్ను పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది.
-నిజమైన జున్ను మృదువుగా ఉంటుంది. అదేవిధంగా నకిలీ జున్ను గట్టిగా కనిపిస్తుంది.
జున్ను ప్రయోజనాలు
జున్ను వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జున్నులో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు (A, B12, K), ఖనిజాలు (పొటాషియం, మెగ్నీషియం, జింక్) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. జున్నులో కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. సన్నగా,బక్కగా వున్నవారు జున్ను తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం వుంది. ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు,మరమ్మత్తుకు దోహదం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.జున్నులోని విటమిన్ లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
