Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా!
దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గబెట్టే ముఠాలపై ఏప్రిల్ 17 నుంచి నిఘా పెంచారు. ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వాడకాన్ని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా హోల్‌సేల్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పండ్లను త్వరగా మగ్గబెట్టేందుకు వాడే కాల్షియం కార్బైడ్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి విషపూరిత పదార్థాల వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి ప్రమాదకర పద్ధతులు పాటించే వ్యాపారులపై అధికారులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.

కెమికల్ మామిడి పండ్లను గుర్తించడం ఎలా? FSSAI కీలక సూచనలు
మీ కుటుంబ ఆరోగ్యం కోసం సహజంగా పండిన మామిడి పండ్లను గుర్తించడం చాలా ముఖ్యం. పండు తొడిమ దగ్గర మంచి సువాసన వస్తుంటే అది సహజంగా పండినట్టు లెక్క. అదే కెమికల్స్‌తో మగ్గబెట్టిన పండ్లు చూడటానికి నిగనిగలాడుతూ పసుపు రంగులో ఉన్నా, వాటికి వాసన ఉండదు. పండు మొత్తం ఒకే రంగులో కాకుండా అక్కడక్కడా పచ్చగా, అసమానంగా ఉంటే అది మంచి పండు అని గుర్తుంచుకోండి.
పండ్ల పైన ఎక్కడైనా తెల్లటి పౌడర్ లాంటి పదార్థం ఉందేమో గమనించండి. అది ఉందంటే కాల్షియం కార్బైడ్ వాడినట్టే. మరో సులభమైన పద్ధతి ఏంటంటే.. ఒక బకెట్ నీళ్లలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు నీటిలో మునుగుతాయి, కానీ కెమికల్స్‌తో మగ్గబెట్టినవి నీటిపై తేలుతాయి. ఈ చిన్న చిట్కాలతో మీరు మోసపోకుండా ఉండొచ్చు.
మామిడి పండ్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను శుభ్రం చేయడం ఇంట్లోనే మొదలవ్వాలి. మామిడి పండ్లను తినడానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టండి. దీనివల్ల పైన ఉన్న కెమికల్స్ పోవడమే కాకుండా, పండులోని వేడి కూడా తగ్గుతుంది. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారు తక్కువ పరిమాణంలో, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారంతో కలిపి వీటిని తీసుకోవడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మామిడి సీజన్‌ను హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.
మామిడి పండ్లను గాలి ఆడే ప్రదేశంలో నిల్వ చేయండి. ప్లాస్టిక్ కవర్లలో ఉంచితే తేమ పెరిగి పండ్లు త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంది. ఎవరైనా వ్యాపారులు అనుమానాస్పదంగా కెమికల్స్ వాడుతున్నట్లు గమనిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తత అందరికీ సురక్షితమైన ఆహారం అందేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
