Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.?
పూజలు, వ్రతాలు, పండుగలకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉపయోగించే వస్ర్రాల రంగులకి ప్రత్యేకత ఉంది. ఎక్కువగా ఎరుపు, కుంకుమ రంగు వస్త్రాలను ఈ వేడుకల్లో ఉపయోగిస్తారు. దీనికంటూ ఓ ప్రత్యేక కారణముందని వేద పండితులు చెబుతున్నారు. ఎర్రటి రంగు వస్త్రాలనే ఎందుకు ఉపయోగిస్తారు.? కారణాలు తెలుసుకుందాం..

హిందూ మత సంప్రదాయం ప్రకారం.. పూజలు, వ్రతాలు, శుభకార్యాలు వంటి మతపరమైన వేడుకల్లో ఎరుపు రంగు దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. దేవాలయాల్లో, ఇంట్లో పూజల్లో పూజా వేదికపై ఎర్రటి వస్త్రాన్ని పరుస్తారు. ఇది అనాది కాలంగా పాటిస్తున్న సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
ఎరుపు రంగు పవిత్రమైనది
హిందూ మత సంప్రదాయం ప్రకారం ఎరుపు రంగును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రంగు శక్తి, బలం, ధైర్యంతో పాటు అంగారక గ్రహానికి ప్రతీకగా పండితులు చెబుతున్నారు. అందుకే దుర్గా దేవి, లక్ష్మీ దేవి పూజల్లో, విఘ్నాలను తొలగించే గణేశుడి పూజలో ఎరుపు రంగుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తూ పూజ సమయంలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉపయోగిస్తారు. దీని వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుందని, శుభ ఫలితాలను ఇస్తుందని పెద్దలు విశ్వసిస్తున్నారు.
పూజలో ఎరుపు రంగు ఎందుకు
శక్తి స్వరూపిణికి ప్రతీకగా ఎరుపు రంగుని భావిస్తారు. అందుకే అమ్మవార్లు ఆలయాల్లో మనకి ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాల్లో అలంకరణతో దర్శనమిస్తారు. నవరాత్రి, లక్ష్మీ పూజ వంటి మతపరమైన ఆచారాల్లో కుంకుమ రంగు దుస్తులు ఉపయోగిస్తుండగా.. గణఏశుడి పూజలో ఎరుపు కండువా, ఆసనానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు లభించి, పుణ్య ఫలాలు అందుతాయని భక్తుల విశ్వాసం.

పూజా వేదికపై ఎర్రటి గుడ్డను పరిచి, దానిపై కలశం, కొబ్బరి కాయ, దేవతా విగ్రహం, ఇతర పూజా సామాగ్రిని పెడతారు. ఇలా చేయడం ద్వారా ఆ ప్రదేశం క్రమబద్ధంగా, పవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. ఎరుపు, కుంకుమ రంగులు మినహా మరే ఇతర రంగులను శుభప్రదంగా భావించరు. ఇవన్నీ ఆధ్యాత్మిక పరమైన కారణాలు.

జ్యోతిష్య పరంగా
పైవన్నీ ఆధ్యాత్మిక కారణాలు అయితే జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎరుపు రంగు.. సూర్యుడు, అంగారకుడితో ముడిపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్య, అంగారకులు శక్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అందుకే పూజలో ఎరుపు రంగు వస్త్రాలను ఉపయోగిస్తే ఈ గ్రహాల శక్తి మనలో చేరుతుందని విశ్వసిస్తారు. జీవితంలో శుభం, సానుకూలత చేకూరుతాయని నమ్మకం.
బోనాల్లో ఎరుపు రంగు చీర
ఇక, ఈ ఆషాఢ మాసంలో వ్రతాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వంటి వాటికి ఆస్కారం లేకపోయినా భగవంతుడికి ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉంటారు. కాగా, ఈ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి వేడుకలు, బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పించడంతో పాటు వొడి బియ్యం పోస్తారు. అప్పుడు ఈ ఎరుపు వస్త్రంలోనే అమ్మవారికి పచ్చ బియ్యం సమర్పిస్తారు. ఈ రంగు కలగలిసేలా చీరను కప్పుతారు. ఇలా చేస్తే అమ్మవారి శక్తి, ధైర్యం లభిస్తుందని.. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications
