Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
వైటమిన్ డి కావలసిందే.. లేదంటే చాలా డేంజర్..
శరీరానికి కావలసని అన్ని పోషకాల్లో వైటమిన్ డి కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. వైటమిన్ డి ుంటేనే యముకలు బలంగా మారుతాయ్. ఎండ నుంచి మనకు వైటమిన్ డి లభిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. ప్రస్తుతం చాలా మందిలో అటు పిల్లలతో పాటు పెద్దల్లో కూడా వైటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వైటమిన్ డి గురించి దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి. లోపిస్తే ఎలాంటి అనారోగ్యాల బాదిన పడతామో తెలుసుకుందాం.
వైటమిన్ డి కేవలం యముకలను బలంగా మాత్రమే వుంచదు. పళ్ల ఆరోగ్యం కూడా వైటమిన్ డి పైనే ఆధారపడి వుంది. బలమైన రోగనిరోధక శక్తి, మెంటల్ హెల్త్ బాగా వుండాలంటే వైటమిన్ డి ని తప్పని సరిగా తీసుకోవాల్సిందే.

వైటమిన్ డి లోపించడం వల్ల ఆస్టియోపొరోసిస్ అనే వ్యధికి గురి కావలసి వస్తుంది. ఇదే కాకుండా డిప్రెషన్ గుండె సంబంధిత వ్యాధుల బారిన కూడా పడతాము. పిల్లల్లో రికెట్స్ వ్యాధికి అవకాశం లభిస్తుంది. యముకలు బలంగా లేకపోవడం వల్ల తరుచుగా ఫ్రాక్చర్లవుతాయ్. యముకలు బలహీనంగా వుండడం వల్ల కండరాల నొప్పి కూడా ఉంటుంది. ఒక్క వైటమిన్ డి లేకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా వుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
శరీరానికి వైటమిన్ డి లభించాలంటే ప్రతీ రోజు ఎండలో కొంత సేపు గడపాలి. వైటమిన్ డి ఉన్న పోషకపదార్ధాలను ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి.
వైటమిన్ డి లోపం ఉందా లేదా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలను చేస్తారు. ఇందులో కొన్ని రకాల పరీక్షల గురించి తెలుసుకుందాం. ముందుగా ఉండేది రక్త పరీక్ష. రక్త పరీక్ష ద్వారా కూడా వైటమిన్ డి లోపం ఉందా లేదా తెలుసుకుంటారు. బోన్ డెన్సిటీ స్కాన్ ద్వారా కూడా యముకలకు సంబంధించిన ఆరోగ్యం బయటపడుతుంది. తరువాత 25-హైడ్రోఆక్సీవిటమిన్ డి రక్త పరీక్ష. ఈ పరీక్ష ద్వారా రక్తంలో వైటమిన్ డి శాతం ఎంత ఉందనేది అంచనా వేసుకుంటారు.
వైటమిన్ డిని పెంచుకోవాలంటే..
ఎండద్వారా వైటమిన్ డి లభిస్తుంది. శరీరంలో ఉండే ఒక రకమైన కొలెస్ట్రాల్‌ను ఎండ వైటమిన్ డి లోకి మారుస్తుంది. వైటమిన్ డి లభించాలంటే తెలుపుగా ఉన్నవారికంటే నలుపుగా వున్నవారే ఎక్కువ సమయం ఎండలో వుండాలి.
సాల్మన్ చేపలో వైటమిన్ డి పుష్కలంగా వుంటుంది. టూనా, ఆయ్‌శ్చర్, శ్రింప్ లాంటి కొన్ని రకాలైన చేపల్లో కూడా వైటమిన్ డి పోషకాలు మెండుగా వుంటాయ్.
శాఖాహారులకు వైటమిన్ డి లభించే ఒకే ఒక్క కూరగాయ మష్‌రూం మాత్రమే. ఎండ ద్వారా మష్‌రూం తనలో వైటమిన్ డి పోషకాన్ని పెంచుకుంటుంది.

గుడ్డులో ఉండే పచ్చ సొనలో కూడా వైటమిన్ డి పోషకం వుంటుంది. అయితే బ్రాయ్‌లర్ కోళ్ల నుంచి వచ్చే గుడ్లల్లో కన్నా నాటు కొడి గుడ్లల్లో వైటమిన్ డి 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
వైటమిన్ డి ఎక్కువగా మాంసాహారం నుంచే లభిస్తుంది. కాబట్టి శాఖాహారులై వారి యముకలు బలహీనంగా వుంటే వారు మాంసం తినడానికి అలవాటు పడాలి. సాల్మన్ చేప, గుడ్లలోని పచ్చసొన రెగులర్‌గా తీసుకుంటూ వుడాలి. అప్పుడు మాత్రమే వారికి కావలసిన వైటమిన్ డి అంది బలంగా వుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications