Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
కర్లీ హెయిర్‌తో ప్రతి రోజూ ‘చిక్కులు’.. ఈ చవకైన టిప్స్ పాటిస్తే సరి.!
నిటారుగా ఉండే కురులతో పోలిస్తే కర్లీ హెయిర్‌ను మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఉంగరాల జుట్టు సంరక్షణకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సిల్కీ హెయిర్ మాదిరిగా సులభంగా జడ వేసుకోలేరు. అలా అని లూజ్‌గా విడిచిపెట్టలేరు. కర్లీ హెయిర్‌ను స్టైలిష్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని కాస్మటాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలు ఇతరులతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే వారి హెయిర్ స్టెలింగ్, జుట్టు ఆకృతి అంతా వేరు. కానీ దాని మెయింటెనెన్స్ వెనుక చాలా శ్రమే ఉంటుంది. సిల్కీ హెయిర్ ఉన్న వారు తల స్నానం చేయడం, జుట్టు ఆరబెట్టడం, దువ్వడం చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఉంగరాల జుట్టు ఉన్నవారికి ఇది అంత తొందరగా తెమలదు. షాంపూలు, నూనెలు, టవల్స్ విషయంలో ఆచితూచీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని గంటల సమయం తీసుకుంటుంది.
సున్నితంగా సంరక్షణ చేయాలి
సిల్కీ హెయిర్‌కి ఆయిల్ అప్లై చేయడం చాలా సులభం. పెట్టిన కాసేపటికే జుట్టు చివర్ల వరకూ వ్యాపిస్తుంది. తలపైన తేమ, సహజనూనెలు సైతం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ ఉంగరాల జుట్టు ఉన్నవారికి ఈ విషయంలో కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే కర్లీ హెయిర్ త్వరగా పొడిబారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే జుట్టు ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవడంతో పాటు సున్నితంగా సంరక్షించుకోవాలి.
ఈ కేరింగ్స్ అవసరం
ఉంగరాల జుట్టు ఉన్న అతివలు ఈ జాగ్రత్తలు పాటించడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. దువ్వేటప్పుడు రఫ్‌గా కాకుండా జాగ్రత్తగా చిక్కులు విడదీయాలి. లేదంటే కర్లీ రింగ్స్ ఒకదానికొకటి చుట్టుకుని జుట్టు ఊడిపోతుంది. ముఖ్యంగా జుట్టు మొత్తం ఆరాక డ్రైగా ఉన్న కురులను దువ్వకూడదు. ఇలా చేయడం ద్వారా జుట్టు పట్టు కోల్పోయి రాలిపోయే ప్రమాదం ఉంది. చేతి వేళ్లతేనే సున్నితంగా దువ్వుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరు సాధారణ దువ్వెనలు కాకుండా పెద్ద పళ్లు ఉన్న దువ్వెనలు వాడాలి.
కర్లీ హెయిర్ ఉన్న వారు ప్రతి రోజూ తలస్నానం చేయకపోవడం ఉత్తమం. లేదంటే జుట్టు ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా స్టైలింగ్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ కాకుండా సున్నితమైన పద్ధతులు అనుసరించాలి. ఇందుకోసం సున్నితంగా ఉండే క్లెన్సర్, కండిషనర్, కర్ల్ క్రీమ్, జెల్ వంటి సింపుల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
కర్లీ హెయిర్‌పై ఇలా చేయకండి..
ఉంగరాల జుట్టు ఉన్నవారు తలస్నానం చేశాక గరుకైన టవల్స్ కాకుండా మైక్రో ఫైబర్ టవల్ లేదా కాటన్ టవల్స్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తల చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం లాంటివి పాటించాలి. బెడ్‌పైన శాటిన్ దిండు కవర్లను ఉపయోగించడం ఉత్తమం.
సులభమైన పద్ధతులు, ప్రొడక్ట్స్‌తో కర్లీ హెయిర్‌ను సంరక్షించుకోవాలని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రెయిట్ హెయిర్‌తో పోలిస్తే.. ఉంగరాల జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువ ఓపిక అవసరం. అందుకనుగుణంగా మీ డైలీ రొటీన్‌ను ప్లాన్ చేసుకుంటూ జుట్టు సంరక్షణకి ప్రాధాన్యత ఇవ్వాలి.
జుట్టు సంరక్షణ అనేది ముఖ్యంగా ఒత్తిడితో, ఖర్చుతో కూడుకున్నది కావొద్దని ఎక్స్‌పర్ట్స్ సలహా ఇస్తున్నారు. జుట్టు సున్నితత్వం దృష్ట్యా హెయిర్ ప్రొడక్ట్స్‌ను ఇష్టారీతిన వినియోగించకూడదు. మీ స్కిన్ టోన్, మీ హెయిర్ కండిషన్‌ను దృష్టిలో ఉంచుకుని జుట్టుకి మేలు చేసే ఉత్పత్తులను ఉపయోగించాలి. ఈ సింపుల్ టిప్స్‌ను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుందని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
