Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
హైదరాబాద్ డాక్టర్లు ఆపరేషన్ లేకుండా ఆ టెక్నాలజీతో అతని కిడ్నీలో ఏకంగా 418 కిడ్నీలను తొలగించిన ఘనత.!
నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ కథనం మీతో పంచుకుంటున్నాం. ప్రపంచంలో అత్యధింగా ప్రాణాంతకంగా ఉన్న వాటిల్లో కిడ్నికి సంబంధించిన వ్యాధులు ఒకటి. కిడ్నీ వ్యాధులుప్రాణాంతకమైనవి. ఈ కిడ్నీ సమస్యలను సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోవతే ప్రాణాలకు ప్రమాదం.
రీసెంట్ గా 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి ఏకంగా 418 రాళ్లను వైద్యులు తొలగించారు. ఇతనికి అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఇతనికి రెగ్యులర్ పద్దతిలో కాకుండా మినిమిల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో శస్త్రచికిత్సకు చేయాలని నిర్ణియించారు.

ఇందులో బాగంగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక పరికరాలతో 2గంటల పాటు ఎంతో శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్ తక్, డాక్టర్ దినేశ్ పాలుపంచుకున్నారు.
ఆ వృద్ధుడి శరీరంలో కిడ్నీ 27 శాతం మాత్రం పనిచేస్తున్నట్లు డాక్టలర్లు కనుగొన్నారు. అతను కొన్ని అనారోగ్య లక్షణాలతో హాస్పిటకు వెళ్ళినప్పుడు ఈ లక్షణాలు గుర్తించిన డాక్టర్లు అతని కిడ్నీలో నుండి ఏకంగా 156 రాళ్లను తొలగించారు. దీనికి అత్యధునిక పద్దతి ద్వారా ఆపరేషన్ చేయకుండానే కీహోల్ పద్దతిలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇలా చేయడం వల్ల రోగికి ఎలా నొప్పి ఉండదు మరియు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
కిడ్నీలో రాళ్ళను తొలగించడం అంత సులభమైన పద్దతి కాదు, చిన్న సైజు రాళ్ళను మెడిసిన్ ద్వారా కరిగించేస్తారు. అయితే రాళ్ల సైజు పెద్దగా ఉన్నప్పడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సింది. అయితే ఈ వృద్ధుడి శరీరంలో కిడ్నీలు ఎక్కువ రాళ్లు ఉండటం వల్ల చాలా చిన్న గాటు పెట్టి కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ పద్దతిని పెర్కటేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్ఎల్) అనే అత్యాధునిక వైద్య విధానం ద్వారా 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుండి 418 రాళ్లను తొలగించారు.
అద్భుతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో లేజర్ ఆధారిత ప్రత్యేకమైన పరికరాలను కిడ్నీలోకి చొప్పిస్తారు. వీటిలో ఓ సూక్ష్మ కెమెరా కూడా ఉంటుంది. దీని ద్వారా కిడ్నీలు తొలగిండం వల్ల అతని కిడ్నీలు కూడా గణనీయంగా మెరుగుపడింది.
ఇలాంటి చికిత్సలు వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్నీ రాళ్ల బాధితులకు ఇది ఆశాదీపం వంటిదని ఏఐఎన్ యూ డాక్టర్లు అభివర్ణించారు. ఈ పద్దతి ద్వారా శరీరలో ఎటువంటి కోత పెట్టాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే వీలైనంత వరకు తక్కువగా ఉప్పు వాడాలి. ఎక్కువ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణుల సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
