Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
జామ ఆకు నెల రోజులు తింటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా..
జామకాయ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. తీయని రుచితో పాటు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు కూడా జాయకామ అందిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే పేదవాడి అమృతం ఇది. తక్కువ ధరకు లభించే ఉత్తమ పోషకాలతో కూడిన జామకాయను తినడం వల్లనే కాకుండా జామ ఆకులను తినడం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా? నెల రోజుల పాటు జామ ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల లేదా జామ ఆకుల రసం తాగడం వల్ల వివిధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు మిమ్మల్ని ఏ వ్యాధుల నుండి రక్షిస్తాయో ఇక్కడ చూడండి.
జామ ఆకులు ఈ వ్యాధుల నుంచి రక్షిస్తాయి
-జామ ఆకుల సారం మహిళ్లల్లో పీరియడ్స్ పెయిన్, తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ మాదిరిగా అది కూడా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా జామ ఆకు సారం
పనిచేస్తుంది.

-ఈ రోజుల్లో షుగర్ వ్యాధి లేదంటే వారి జన్మ ధన్యమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య డయాబెటిస్. అయితే ప్రీడయాబెటిస్ లేదా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి జామ ఆకులు అనువైనవి. జామ ఆకులు శరీరంలో గ్లూకోజ్‌ను గ్రహించడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
-జామ ఆకు టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది
-జామ ఆకులలో పెద్ద మొత్తంలో యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పేగులలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతాయి. దీంతో అజీర్ణం, అపానవాయువు వంటి సమస్యలు తగ్గుతాయి.
-జామ ఆకులలో క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని నిర్మించడంలో ముఖ్యంగా ప్రభావవంతంగా ఉంటుంది.
-జామ ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. జామ ఆకులు మొటిమలు లేదా చర్మపు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆకు చర్మ ప్రకాశాన్ని పెంచడానికి కూడా గొప్పగా పనిచేస్తుంది.
-జామ ఆకులు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను చక్కెరగా మార్చకుండా నిరోధిస్తాయి. ఫలితంగా ఈ ఆకు శరీర బరువును తగ్గించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.
-జామ ఆకులు అల్సర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించే ముందు డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
