Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఏ చేపలు తినడం మంచిది? చెరువు చేపా? సముద్రపు చేపా?
సీ ఫుడ్ లో చాలామంది ఫేవరెట్ చేప. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే చాలామంది ఇంట్లో అయితే రోజూ చేప తప్పనిసరిగా ఉంటుంది. చేపల్లో బోలెడు వెరైటీలు కూడా ఉంటాయి. సాధారణంగా చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే చేపలు మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం. అయితే చేపలు తినే చాలామందిలో ఉండే అతిపెద్ద సందేహం ఏంటంటే..చెరువు చేపలు తినడం మంచిదా? సముద్రపు చేపలు తినడం మంచిదా?..ఈ ప్రశ్నకు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముఖర్జీ మదివాడ ఓ వీడియోలో సమాధానం చెప్పారు. ఆయనేం చెప్పారో ఇక్కడ చూడండి.
చెరువు చేపలు అంటే.. బొమ్మిడాయిలు, రోహు, బొచ్చె, తిలాపియా వంటి వాటిలో ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది..ఫ్యాట్(కొవ్వు)తక్కువ ఉంటుంది. అందుకే ఫ్లేవర్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వీటిల్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చెరువు చేపల్లో కొంచెం తక్కువగా ఉంటాయని డాక్టర్ ముఖర్జీ చ ెప్పారు. చెరువు చేపలు మనకు చాలా సులభంగా, తాజాగా దొరుకుతాయి. చాలాసార్లు బతికున్న చేపలనే అమ్ముతారు కాబట్టి తాజాదనం గురించి సందేహం అవసరం లేదు. సముద్రపు చేపలతో పోలిస్తే వీటిలో పాదరసం వంటి భార లోహాల ముప్పు చాలా తక్కువ. ఇవి సముద్రపు చేపల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. చెరువు నీటి నాణ్యతపై చేపల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కలుషితమైన నీటిలో పెరిగిన చేపలు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కొన్నిసార్లు వీటికి కొద్దిగా మట్టి వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

అదే సముద్రపు నీరు లేదా ఉప్పు నీటి చేపల విషయానికొస్తే.. వంజరం,బంగుడు, ట్యూనా, సాల్మన్ వంటివి గుర్తుకొస్తాయి. సముద్రపు నీటిలో సహజంగా ఉండే అయోడిన్, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు ఈ చేపలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుకు, రోగనిరోధక శక్తికి దోహదపడతాయి. సముద్రపు చేపలలో ముఖ్యంగా చల్లని నీటిలో పెరిగే చేపలలో ఒమేగా-3 చాలా అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు పనితీరును చురుగ్గా ఉంచడానికి, కంటి చూపుకు చాలా అవసరం. సముద్ర కాలుష్యం కారణంగా కొన్ని పెద్ద చేపలలో 'పాదరసం' (Mercury) వంటి భార లోహాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. సుముద్రపు చేపల్లో కూడా చిన్న చేపల్లో మెర్క్యురీ తక్కువగా ఉంటుందని డాక్టర్ ముఖర్చీ చెప్పారు.
ఏది మేలు?
సముద్రపు చేప, చెరువు చేప.. రెండింటిలోనూ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా-3లు అధికంగా కావాలనుకుంటే చిన్న సముద్రపు చేపలు (మ్యాకరెల్, సార్డైన్స్ వంటివి) ఎంచుకోవడం ఉత్తమం. తక్కువ ధరకు, తాజాగా, సురక్షితమైన చేపలు కావాలనుకుంట, మంచి చెరువు నుండి వచ్చిన చేపలు సరైన ఎంపిక. అత్యుత్తమ మార్గం ఏమిటంటే, రెండింటినీ మార్చి మార్చి తినడమేనని డాక్టర్ ముఖర్జీ సూచించారు. వారంలో ఒకసారి సముద్రపు చేప, మరోసారి చెరువు చేప తినడం ద్వారా అన్ని రకాల పోషకాలను సమతుల్యంగా పొందవచ్చు. మీ ఆరోగ్యం, బడ్జెట్, లభ్యతను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి. ఏ చేప తిన్నా దానిని బాగా ఉడికించించనది అయినా లేదా బాగా ఫ్రోజెన్ చేసినది అయినా తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications