Latest Updates
-
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.!
Sweating Good For Skin: చెమట పడితే చర్మానికి మంచిదా? వైద్యులు ఏమంటున్నారంటే..
శరీరానికి చెమట పట్టడం సాధారణం. వేసవి వచ్చిందంటే కొందరికి చెమట ఎక్కువగా వస్తుంది. ఆరుబయట పని చేస్తున్నప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, కష్టమైన పనులు చేసినప్పుడు, జిమ్ లో వర్కవుట్స్ చేసినప్పుడు చెమట పడుతుంది.

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పడు, వేడెక్కిన చర్మాన్ని చల్లబరచడానికి శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. అయితే చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అంటే శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది. దీని వల్ల శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది. ఆ తర్వాత డీహైడ్రేషన్ కు గురవుతాం. అయితే చెమట పట్టడం గురించి చెడుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చెమట వల్ల కూడా లాభాలు ఉన్నాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో ఎందుకు ఎక్కువగా చెమట పడుతుంది?
వేసవి అంటే మనకు ఎక్కువగా చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత 33.2 డిగ్రీ సెల్సియస్ నుంచి 37.7 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంటుంది. శరీర పనితీరు సక్రమంగా జరగడానికి ఈ ఉష్ణోగ్రత కలిగి ఉండాలి.
బయటి ఉష్ణోగ్రత అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు శరీరం తనను తాను చల్లబరచడానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. అంతర్గత వ్యవస్థ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చెమట రూపంలో నీటిని బయటకు వస్తుంది.
చెమట పట్టడం చర్మానికి మేలు చేస్తుంది:
చెమట పట్టడం వల్ల చర్మం జిగటగా మారుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుంది. అలాగే..
* రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
* ట్యాక్సిన్లను తొలగిస్తుంది
* చర్మానికి గ్లో ఇస్తుంది
* యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగిన చెమటలో డెర్మ్ సిడిన్ ఉండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది
* ఇది హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. అలాగే మొటిమలు రాకుండా చేస్తుంది
* ఇది సహజమైన ఎక్స్ ఫోలియంట్ గా పని చేస్తుంది
* ఇది ఉప్పును, నీటిని తొలగిస్తుంది. మురికి, ధూళి, మేకప్ పేరుకుపోకుండా చేస్తుంది
* చర్మానికి సహజమైన హైడ్రేషన్ ను తెస్తుంది
* సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.
ఎంత చెమట పట్టడం మంచిది?
ఎంత చెమట పట్టడం అనేది పర్యావరణం, మందులు, ఆరోగ్య పరిస్థితులు, విటమిన్ల లోపం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చెమట వల్ల శరీరంలోని ట్యాక్సిన్లు తొలగిపోతాయి. ఈ ట్యాక్సిన్లు తొలగిపోకపోతే.. అవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
