Latest Updates
-
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
ఏ రోగానికి అయినా మూలం కడుపే అని మన పెద్దలు ఎప్పడో చెప్పారు. మన బాడీకి రెండో మెదడు మన జీర్ణవ్యవస్థ అని చెప్పవచ్చు. మనం ఆరోగ్యంగా,ఏ రోగాలు రాకుండా ఉండాలన్నా ఫస్ట్ మన పేగులు ఆరోగ్యంగా ఉండాలి. పేగులు ఆరోగ్యంగా ఉంటే చాలా రోగాలు మనల్ని చుట్టుముట్టవు.
పేగుల్లో పేరుకుపోయే వ్యర్థాలే క్యాన్సర్, మలబద్ధకం, చర్మ సమస్యలు, ఊబకాయం వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు కారణం. అందుకే పేగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. మన పేగులను సహజంగా క్లీన్ చేసి, గట్ హెల్త్ ను కాపాడే 10 అద్భుతమైన ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.

చద్దన్నం
రాత్రి అన్నం మిగిలిపోతే అందులో నీళ్లు పోసి, ఉదయాన్నే మజ్జిగ కలుపుకుని తినే చద్దన్నం పేగులకు అమృతం లాంటిది. ఇందులో కోట్లాది ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) ఉంటాయి. ఇవి గట్ హెల్త్ ను అమాంతం పెంచుతాయి.
మజ్జిగ
మజ్జిగ మన పొట్టకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జీర్ణవ్యవస్థను చల్లబరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాకుండా, పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.
బూడిదగుమ్మడి
ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ డిటాక్స్ డ్రింక్ బూడిదగుమ్మడి రసం. ఉదయాన్నే ఈ రసం తాగితే పేగుల్లోని మురికి, విషతుల్యాలు మొత్తం పోతాయి. పొట్టను అత్యంత శుభ్రంగా ఉంచుతుంది.

అవిసె గింజలు
వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పీచుపదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల కదలికలను సులభతరం చేసి, మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తాయి.
రాగులు
ఫైబర్ కు కేరాఫ్ అడ్రస్ రాగులు. రాగి జావ లేదా రాగి ముద్ద తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పొట్టను తేలికగా ఉంచుతూనే పేగులను క్లీన్ చేస్తుంది.
అంజీర్
మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి అంజీర్ ఒక దివ్యౌషధం. రాత్రి పూట నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను ఉదయం తింటే, పేగుల్లో గట్టిపడిన వ్యర్థాలు సైతం సులభంగా బయటకు వచ్చేస్తాయి.
ఉసిరి
విటమిన్ సి తో నిండి ఉండే ఉసిరి.. జీర్ణ రసాలను బ్యాలెన్స్ చేస్తుంది. అసిడిటీని తగ్గించి, పేగుల గోడలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరిది ప్రత్యేక స్థానం.
నిమ్మ
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే జీర్ణక్రియ చురుకుగా మారుతుంది. పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను కరిగించి బయటకు పంపడంలో నిమ్మ సూపర్.
కీరదోస
ఇందులో నీటిశాతం, ఫైబర్ ఎక్కువ. ఇది పేగులను హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా, కడుపులో మంటను తగ్గించి చలవ చేస్తుంది.
నీళ్లు
అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది నీరు. మనం తీసుకునే ఫైబర్ సరిగ్గా పనిచేసి, వ్యర్థాలు బయటకు వెళ్లాలంటే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
