నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!

వినాయక చవితి నవరాత్రులు ప్రతి కాలనీ, వీధుల్లో కోలాహలమే. గణనాథుడి పాటలు, భజనలు, కీర్తనలు, కోలాటాలు, ప్రత్యేక పూజలు, నైవేద్యాల సమర్పణ ఇలా స్థానికులంతా ఏకమై ఎంతో సందడిగా ఈ నవరాత్రుల్లో భాగం అవుతారు. ఇక, నిమజ్జనం రోజు మళ్లీ రావయ్యా గణపయ్యా అంటూ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అయితే వినాయకుడి నిమజ్జనం సందర్భంలో మాత్రం మీరు ఆయన చెవిలో ఈ మూడు పదాలు చెప్పారంటే మీ తీరని కోరికలు సైతం నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అవేంటి.. ఎలా చెప్పాలి.. ఇక్కడ తెలుసుకుందాం..

Whisper these 3 words into Lord Ganesha s ear on immersion day wish sure to come true

ఈ ఏడాది గణేశ్‌ చతుర్థి సెప్టెంబర్‌ 17న రాగా, నిమజ్జనం తేదీ సెప్టెంబర్‌ 25 శుక్రవారం అంటే అనంత చతుర్ధశి నాడు వస్తుంది. నిమజ్జనం రోజు ప్రత్యేక పూజలు, లడ్డూ, కలశం వేలం పాటలు, ఇలా ఎన్నో కార్యక్రమాల అనంతరం ఉత్సాహంగా గణపయ్యను నిమజ్జనానికి తరలిస్తారు. ఈ క్రమంలో విఘ్నేశ్వరుడు మన బాధలు, కష్టాలు, దుఃఖాలను తనతో తీసుకెళ్లి.. బదులుగా మన జీవితంలో సుఖసంతోషాలు నింపుతాడని విశ్వసిస్తారు. ఇలాంటి పవిత్రమైన సందర్భంలో మీరు మీ కోరికను ఆయన చెవిలో స్పష్టంగా చెప్పగలిగినట్లయితే మీకు సత్ఫలితాలు అందుతాయి.

భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!

హిందూ సంప్రదాయం, పౌరాణిక విశ్వాసాల ప్రకారం నిమజ్జనం రోజున గణపతి నేరుగా కైలాసానికి చేరుతాడు. అందుకే ఆయన బయలుదేరే ముందు బయట వ్యక్తులకు వినపడకుండా చెవిలో చెప్పిన మాట గణనాథుడికి చేరి ఆ సందేశాన్ని శివపార్వతులకు చెరవేస్తాడని విశ్వసిస్తారు. అందుకే నిమజ్జనం ముందు ఈ నియమాన్ని పాటించాలని చెబుతారు.

Whisper these 3 words into Lord Ganesha s ear on immersion day wish sure to come true

లంబోదరుడి చెవిలో ఇలా చెప్పండి..

నిమజ్జనానికి తరలించేముందు శ్రీ మహా గణపతి ఎడమ చెవిలో మీ కోరికను చెప్పండి. ఆయన ఎడమ చెవిలో చెప్పడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. మీ కుడి చేతితో మీ నోటికి, గణనాథుడి చెవికి మధ్య అడ్డు పెట్టి మీ మనసులోని అభిలాషను చెప్పండి. ఇలా చేయడం ద్వారా ఇతరులకు వినిపించే అవకాశం ఉండదు. మనస్ఫూర్తిగా, పూర్తిగా భక్తిశ్రద్ధలతో మీ కోరికను చెప్పి 'నా కార్యాన్ని పూర్తి చేయి స్వామి’ అని వేడుకోండి. 'గౌరవాన్ని కాపాడు’ అని విన్నవించండి. 'మేలు కలిగేలా చూడు’ అని చెప్పండి. ఉద్యోగం, ఇంట్లో సంతోషం, ఆరోగ్యం ఇలా నిస్వార్థమైన కోరిక ఏదైనా సరే ఆయన చెవిలో స్పష్టంగా చెప్పండి.

శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.!

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

గణేశ్‌ నవరాత్రుల్లో మీరు తెలిసీతెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే గణపతి నిమజ్జనానికి ముందు చేతులు జోడించి ఆయనకు క్షమాపణలు చెప్పుకోండి. తర్వాత స్వామికి ఇష్టమైన మోదకాలు, కొబ్బరికాయ లాంటి ప్రసాదాలను ముడుపుగా కట్టండి. కుటుంబమంతా కలిసి హారతి ఇచ్చిన అనంతరం విగ్రహాన్ని కొంచెం కదపండి. తర్వాత ఆయనకు వీడ్కోలు చెప్పి గంగమ్మ ఒడికి చేర్చండి.

Story first published: Friday, September 18, 2026, 10:52 [IST]
Desktop Bottom Promotion