Latest Updates
-
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్?
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్‌లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.!
మీరు ఎంత హెల్తీగా ఉన్నా, ఫిట్‌గా ఉన్నా మీ శరీరంలో కొవ్వు లేదనుకుంటే పొరపాటు. మీ బాడీ చెకప్ చేసుకునేంత వరకు ఫ్యాట్ వివరాలు తెలియవు. అయితే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ ఒంటికి మంచిది అయితే చెడు కొలెస్ట్రాల్‌తో అనారోగ్య సమస్యలకి తలుపు తెరిచినట్లే. అయితే ఇక్కడ మీ శరీరంలో ఫ్యాట్ ఏ కలర్‌లో ఉందనేది కీలకం. ఫ్యాట్ రంగు ఆధారంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

సాధారణంగా శరీరంలో కొవ్వు రెండు రంగుల్లో ఉంటుంది. ఒకటి తెలుపు, ఇంకొకటి గోధుమ రంగు. కాగా, వైట్ ఫ్యాట్ ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వైట్ ఫ్యాట్‌ను బ్రౌన్ ఫ్యాట్‌గా మార్చుకోగలిగితే ఈ వ్యాధి ప్రమాదాల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వైట్ ఫ్యాట్‌లోని శక్తి నిల్వలను బ్రౌన్ ఫ్యాట్‌లోని కణాలు కరిగించేందుకు సహాయ పడతాయి. అందుకే గోధుమ రంగు కొవ్వును అందించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని.. దీని ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుందని సూచిస్తున్నారు.

బ్రౌన్ ఫ్యాట్‌ను అందించే పదార్థాలను మీ డైలీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటిలోని కొవ్వు కణాలు శరీర ఉష్ణోగ్రతలను బట్టి వాటి రూపాలను మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం శరీర జీవక్రియ(మెటబాలిజం)ను మెరుగుపరుచుకోవాలి. క్సాప్సైసిన్ అనే సప్లిమెంట్స్‌ను తీసుకోవడం ద్వారా మెటబాలిజం పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అయితే ఈ సప్లిమెంట్స్ ఎక్కువగా మిరపకాయల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

బెల్లీ ఫ్యాట్ ఈ రంగులోనే ఉంటుంది.
సన్నగా, లావుగా ఉన్నారనే తేడా లేకుండా చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట చుట్టూ భాగంలో తెల్ల కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సరైన డైట్, జీవనశైలి లేకపోవడం కారణంగా వైట్ ఫ్యాట్ త్వరగా కరిగిపోదు. ఇక, మెడ భాగం, భుజాలు, చేతుల్లో బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది. వైట్ ఫ్యాట్‌తో పోలిస్తే ఇది సులభంగా కరిగిపోతుంది.

బ్రౌన్ ఫ్యాట్ ఎందుకు
మన బాడీలోని బ్రౌన్ ఫ్యాట్ శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. చలి నుంచి కాపాడుకునేలా చేస్తుంది. అందుకే దీనిని కరిగించుకోవడం చాలా ఈజీ. ఇక ఒబెసిటీ నియంత్రణలో భాగంగా శాస్త్రవేత్తలు సైతం వైట్ ఫ్యాట్‌ను బ్రౌన్ ఫ్యాట్‌గా మార్చి కొవ్వు కరిగేలా పరిశోధనలు చేస్తున్నారు.

కాగా, శరీరంలో వైట్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే దానిని కరిగించేందుకు ప్రయత్నాలు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒబెసిటీతో బాధపడుతున్న వారిలో వైట్ ఫ్యాట్ కంటే బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే వారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ. బ్రౌన్ ఫ్యాట్, సప్లిమెంట్స్ సహాయంతో వైట్ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. లేదంటే హార్మోన్ల సమస్యలు తలెత్తవచ్చు. ఇదిలా ఉండగా కొందరిలో మాత్రం లావుగా ఉన్నా వారిలో జెనెటికల్‌గా బ్రౌన్ ఫ్యాట్ ఉంటోందని.. అయితే ఇందుకు కారణాలు మాత్రం వెల్లడి కాలేదని పరిశోధనల్లో తేలింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
