మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.!

గుమ్మడికాయ అనగానే మనకు ఎక్కువగా దిష్టికి ఉపయోగించడం గుర్తొస్తుంది. కానీ ఈ గుమ్మడికాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గింజలు మొదలుకొని కాయల వరకు శరీరంలో ఎన్నో రకాల రోగాలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇక గుమ్మడికాయతో చేసే దప్పళం వంటకం మన పూర్వీకుల బలమైన ఆరోగ్యానికి రహస్యం అంటే అతిశయోక్తి కాదు. ఈ కాలంలోనూ అలాంటి ఆరోగ్యం కావాలంటే ఈ వంటకాన్ని తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే.. గుమ్మడికాయ దప్పళం ఎలా తయారు చేయాలో చూద్దాం..

Here is how to prepare Pumpkin Dappalam an ancestral health secret

గుమ్మడికాయ దప్పళం తయారీకి కావాల్సిన పదార్థాలు

గుమ్మడికాయ- ఒకటి
చింతపండు- నిమ్మకాయ సైజు
ఉల్లిపాయలు- నాలుగు
పచ్చిమిర్చి- నాలుగు
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
పచ్చిశనగపప్పు- టీస్పూన్‌
మినప్పప్పు- టీస్పూన్‌
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
ఎండుమిర్చి- రెండు
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- పావు టీస్పూన్‌
ఉప్పు- టీస్పూన్‌
కారం- రెండు టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- పది
బెల్లం- మూడు టీస్పూన్లు
బియ్యంపిండి- రెండు టీస్పూన్లు

గుమ్మడికాయ దప్పళం తయారీ విధానం

ఒకవైపు షుగర్‌, మరోవైపు స్వీట్‌ క్రేవింగ్స్‌.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!

ముందుగా చింతపండును కడిగి కొన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత గుమ్మడికాయను పైనుంచి మట్టిలేకుండా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసి నీళ్లలో వేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి లేదా బాణలి పెట్టుకుని వేడయ్యాక మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలను వేసి కలపండి. మూత పెట్టి పదినిమిషాల పాటు ఉడికిన తర్వాత గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరో పదినిమిషాల పాటు ఉడకనివ్వండి.

Here is how to prepare Pumpkin Dappalam an ancestral health secret

గుమ్మడి కాయ ముక్కలు ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూతపెట్టండి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కలపండి.

గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా!

అనంతరం నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకుని కలిపి మీకు కావాల్సిన విధంగా గ్రేవీ కోసం నీళ్లు పోసి మరోసారి కలపండి. బెల్లం వేసి కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు మీడియం మంటపైన ఉడికించుకోండి.

ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యంపిండిని వేసుకుని కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి దానిని కూరలో వేసి కలపండి. ఈ పిండి కలపడం ద్వారా గ్రేవీ చిక్కగా అవుతుంది. తర్వాత ఉప్పు సరిచూసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు నూనె పైకి తేలుతూ మీకు కావాల్సిన విధంగా వచ్చిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే..

గుమ్మడికాయ దప్పళం రెడీ. మధ్యాహ్నం లంచ్‌లో వేడిగా అన్నంలోకి ముద్ద పప్పు, అప్పడాలు లేదా ఆమ్లెట్‌తో తింటే ఆ రుచికి ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారు.

[ of 5 - Users]
Story first published: Friday, September 18, 2026, 12:09 [IST]
Desktop Bottom Promotion