Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
ఓమై గాడ్..నగరాల్లో ఉండే 65% మంది యువతకి ఆ సమస్య..ఇది సరిచేసుకోకుంటే డేంజర్ లో!
ఒకప్పుడు వెన్ను, మెడ నొప్పులు అంటే వయస్సు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చేవి అనుకునేటోళ్లు..కానీ ఈ రోజుల్లో చాలామందికి 20 ఏళ్లకే మెడ నొప్పి, 30 ఏళ్లకే నడుం పట్టేయడం వంటివి చూస్తున్నాం. ముఖ్యంగా నగరాల్లో నివసించే యువత ఎదుర్కొంటున్న కొత్త ఆరోగ్య సంక్షోభం ఇది. అందుకే దీనిని నిపుణులు అర్బన్ స్పైన్ క్రైసిస్ అని పేరు పెట్టారు. అయితే యువత ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ప్రధాన కారణం మారిన లైఫ్ స్టైయిల్, ముఖ్యంగా కార్పొరేట్ వర్క్ కల్చర్ అని చెబుతుంటారు. నేటి యువతరం గంటల తరబడి కంప్యూటర్ల ముందు,కుర్చీకు అతుక్కుపోయి పనిచేస్తున్నారు.
రోజంతా వర్చువల్ మీటింగ్స్, కదలకుండా ఒకేచోట కూర్చోడం, శారీరక శ్రమ లోపించడం వంటివి వెన్నుముకపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో కండరాలు బలహీనపడిపోయి వెన్నుపూసల మధ్య అరుగుదల వేగవంతమవుతోంది. అయితే ఈ ప్రాబ్లమ్ ఆఫీసుతోనే ఆగిపోవట్లేదు. వర్కింగ్ అవర్స్ ముగిసిన తర్వాత కూడా గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూస్తుండటం కూడా ఈ సంక్షోభాన్ని మరింత జఠిలం చేస్తున్నాయి. గంటల తరబడి తల వంచి స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల మెడపై భారం పడిపోయి అది దీర్ఘకాలిక నొప్పులకు దారితీస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం వృత్తి నిపుణుల్లో వెన్ను, మెడ నొప్పులతో బాథపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ మన వర్క్ ని ఎంత ఈజీ చేసినప్పటికీ మన శరీరాలను శిథిలం చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

నిర్లక్ష్యం వద్దు..భవిష్యత్తు ముద్దు
ప్రారంభంలో చాలాంది మెడ బిగుసుకుపోవడం,చేతుల్లోకి పాకే తిమ్మిర్లు, తేలికపాటి నడుం నొప్పి వంటి లక్షణాలను తేలిగ్గా తీసుకుంటారు. నొప్పి వచ్చినప్పుడు ఓ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకోవడమో, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడమే చేస్తుంటారు. అయితే ఇది తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది కానీ అసలు సమస్యను పరిష్కరించరు. ఈ చిన్న నిర్లక్ష్యమే భవిష్యత్తులో స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్ వంటి తీవ్రమైన వ్యాధుల రూపంలో మనల్ని చుట్టుముడుతుంది.
పరిష్కారం ఏంటీ
అర్బన్ స్పైన్ క్రైసిస్ నుంచి బయటపడటానికి ఫిజియోథెరపీ బెస్ట్ ఆప్షన్. చిన్నపాటి నొప్పే కదా అని నిర్లక్ష్యం చేయకుండా అది తీవ్రరూపం దాల్చకముందే ఫిజియోథెరపీ వంటి నివారణ మార్గాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం నొప్పికి ట్రీట్మెంట్ మాత్రమే కాదు..సమస్య మళ్లీ మళ్లీ రాకుండా నిరోధించే ఒక సంపూర్ణ ప్రక్రియ. ఇందులో ఎక్సర్ సైజ్, సరైన భంగిమను అలవర్చుకోవడం, కండరాలను బలపర్చే పద్ధతులు ఉంటాయి. అవసరమునుకుంటే నిపుణులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
