శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా..

Posted By:

మనదేశంలో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా కప్పుల మీద కప్పుల టీ తాగే వ్యక్తులు కోట్ల మందే ఉంటారు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి బక్కసారి మీ ఇంట్లో లెమన్ డీటాక్సిఫికేషన్ టీ ట్రై చేసి చూడండి. ఇది మాములు టీల కంటే కొన్ని వందల రెట్లు మేలు చేస్తుంది, లివర్ ను శుభ్రపరుస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వీటన్నింటి నుంచి స్వాంతన ఇస్తుంది. కాలుష్యం, బంక్ ఫుడ్ తినడం వంటి కారణాల వల్ల శరీంలో అనేక విషతుల్యాలు పేరుకుపోతాయి. వీటిని బాడీ నుంచి బయటకు పంపే ప్రక్రియనే డీటాక్సిఫికేషన్ అంటారు.

బాడీలోని మలినాలను సహజ పద్దతిలో తొలగించడానికి, లివర్ ను శుభ్రపర్చడానికి చాలా ఈజీ, ప్రభావవంమైన మార్గాల్లో ఒకటి లెమన్ డీటాక్స్ టీ తాగడం. ఇది మనసుకు ప్రశాంతత ఇస్తుంది, బీపీని కంట్రోల్ లోకి తెస్తుంది. రొంప, జ్వరం వచ్చిన టైంలో వేడి వేడిగా దీన్ని తాగుతుంటే రోగాలన్నీ మాయమై శరీరం హాయిగా ఉన్నట్లు ఫీల్ ఉంటుంది. వందల లాభాలున్న ఈ టీని అన్ని వేళలా తాగవచ్చు. దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Lemon Detox Tea Recipe in Telugu Cleanse Your Liver Flush Toxins Naturally

తయారీకి కావాల్సిన పదార్థాలు

-లెమన్ గ్రాస్
-దాల్చిన చెక్క
-బెల్లం పొడి
-మిరియాల పొడి
-దంచిన అల్లం
-నిమ్మరసం
-నీళ్లు

చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక

లెమన్ డీటాక్సిఫికేషన్ టీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 400 ml నీళ్లు పోసి మరిగించాలి.

-నీళ్లు మరుగుతుండగానే అందులో 2 లెమన్ గ్రాస్ ని వేళ్లతో సహా తీసుకొని, వాటిపైన పొరలను ఒలిచి, మిగిలిన లెమన్ గ్రాస్ ని ఆకులతో సహా తాడు పేనినట్లుగా దగ్గరగా బలంగా చుట్టుకోండి. ఈ చుట్టుకున్న లెమన్ గ్రాస్ మరుగుతున్న నీటిలో వేయండి, ఇందులోనే పావు చెంచా దంచిన అల్లం వేసి తక్కువ మంట మీద బాగా మరగనివ్వాలి.

-నీళ్లు 2-3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, దంచిన పావు చెంచా మిరియాల పొడి వేసుకోండి. ఈ టీని 300 ml అయ్యేవరకు మీడియం మంట మీద మరగనివ్వాలి.

-తర్వాత ఆ నీటి మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకున్న టీని కప్పులొ పోసి అందులో అర చెక్క నిమ్మరసం పోయండి.

-అంతే లెమన్ డీటాక్సిఫికేషన్ టీ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion