Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
రోజుకు 4 సార్లు కడుపు నిండా తింటూనే 12 కిలోల బరువు తగ్గిన యువకుడు.. ఎలాగో తెలుసా?
ఈ రోజుల్లో మనదేశంలో చాలామందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అధిక బరువు లేదా ఊబకాయం. అధిక బరువు కారణంగా షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్ వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు దరిచేరే అవకాశం ఉంది. ఈ భయంతోనే చాలామంది బరువు తగ్గాలని నిర్ణయించుకుంటారు.
అయితే బరువు తగ్గడం అనగానే అందరికీ గుర్తొచ్చేది పస్తులు ఉండటం. అన్నం మానేసి రోజంతా ఆకలితో అలమటిస్తూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కడుపు మాడ్చుకోకుండా, కేవలం సరైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గవచ్చని నిరూపించాడు ఇషాన్ కర్దే అనే యువకుడు.

ఇషాన్ కర్దే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన అద్భుతమైన వెయిట్ లాస్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. ఎలాంటి కఠినమైన ఉపవాసాలు చేయకుండా, రోజుకు నాలుగు సార్లు కడుపు నిండా తింటూ కేవలం రెండు నెలల్లోనే 82 కిలోల నుంచి 70 కిలోలకు (12 కిలోలు) తగ్గాడు.
బరువు తగ్గడానికి ఇషాన్ పాటించిన నియమాలు
ఇషాన్ తన డైట్ ప్లాన్ ను 80-90 శాతం ఖచ్చితత్వంతో పాటించాడు. అతని విజయానికి ప్రధాన కారణం అతని క్రమశిక్షణ. ఈ రెండు నెలల పాటు అతను ఎలాంటి చీట్ మీల్స్ తీసుకోలేదు. చక్కెర, బయట దొరికే చిప్స్, బిస్కెట్లు, జంక్ ఫుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. బిజీగా ఉన్న రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ వ్రాప్స్ లేదా రైస్ బౌల్స్ తీసుకునేవాడు.
ఇషాన్ ప్రతిరోజూ తీసుకున్న డైట్ ప్లాన్ వివరాలు
ఉదయం బ్రేక్ ఫాస్ట్
ఇషాన్ తన రోజును హై ప్రోటీన్ ఆహారంతో ప్రారంభించేవాడు. ఉదయం ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు, ఒక స్కూప్ వే ప్రోటీన్ (Whey Protein) తీసుకునేవాడు. ఈ బ్రేక్ ఫాస్ట్ ద్వారా అతనికి 35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభించేది. ఉదయాన్నే ప్రోటీన్, ఫైబర్ తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా, పదే పదే ఆకలి వేయకుండా ఉంటుంది.
మధ్యాహ్న భోజనం
మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, రెండు రోటీలు, తేలికపాటి గ్రేవీ, ఒక ప్లేట్ సలాడ్ తినేవాడు. దీని ద్వారా అతనికి 50 గ్రాముల ప్రోటీన్, 45-50 గ్రాముల కార్బ్స్, 10-12 గ్రాముల కొవ్వు దొరికేది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూనే బరువు తగ్గడానికి సహాయపడింది.
సాయంత్రం స్నాక్స్
సాయంత్రం ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ వైపు వెళ్లకుండా, ఒక పండు, గుప్పెడు డ్రై ఫ్రూట్స్ (నట్స్), 5 ఉడకబెట్టిన గుడ్డు తెల్లసొనలు (Egg whites) తినేవాడు. ఈ హెల్తీ స్నాక్ ద్వారా 22-24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బ్స్, 8 గ్రాముల ఫ్యాట్ లభించేది.
రాత్రి భోజనం
రాత్రి పూట ఆహారం ఎప్పుడూ తేలికగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇషాన్ కూడా ఇదే పాటించాడు. రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించేసాడు. 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ మాత్రమే తీసుకునేవాడు. దీని ద్వారా 45 గ్రాముల ప్రోటీన్, కేవలం 5 గ్రాముల కార్బ్స్, 8 గ్రాముల ఫ్యాట్ శరీరానికి అందేది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications