Latest Updates
-
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.!
ఎవ్వరినీ వదలని విటమిన్ B12, విటమిన్ D,ఐరన్ లోపాలు..రోజూ ఏం చేయాలంటే..
ఉదయం లేవగానే నీరసం.. పగలంతా ఏదో తెలియని అలసట.. సీజన్‌తో సంబంధం లేకుండా రాలిపోతున్న జుట్టు.. ఎంత నిద్రపోయినా సరే తగ్గని బద్ధకం. ఇవన్నీ కేవలం ఒత్తిడి వల్లనో, బిజీ లైఫ్ స్టైల్ వల్లనో జరుగుతున్నాయని మనం తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ నిజానికి మన శరీరం నిశ్శబ్దంగా కొన్ని అత్యంత ముఖ్యమైన పోషకాల కోసం అల్లాడిపోతుండవచ్చు. అవే విటమిన్ B12, విటమిన్ D, ఐరన్.
గతంలో కంటే ఇప్పుడు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ పోషకాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏదో ఒక్క వయసు వారికో లేదా వర్గానికో పరిమితం కాలేదు. తాము చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామని నమ్మే వారు కూడా దీని బారిన పడుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ సమస్యను రోజూవారీ పనులతో ఎలా అధిగమించవచ్చో ఇక్కడ చూడండి.

ఆధునిక జీవనశైలే అసలు విలన్
ఉదయం హడావుడిగా బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం, మధ్యాహ్నం ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, రాత్రి ఎప్పుడో ఆలస్యంగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎండ తగలని ఏసీ గదుల్లో స్క్రీన్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్లే అన్ని వయసుల వారిలో విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్ లోపాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ పోషకాలు చేసే మేలు ఏంటి?
విటమిన్ బి12 నరాల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు కీలకం. విటమిన్ డి క్యాల్షియంను గ్రహించి ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఐరన్ రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు సహాయపడుతుంది. వీటి లోపం వల్ల విపరీతమైన అలసట, ఏకాగ్రత లోపించడం, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఇంటి భోజనం తిన్నా లోపం ఎందుకు వస్తోంది?
రోజువారీ ఇంట్లో వండిన ఆహారం తీసుకుంటున్నాం కదా మనకేం ఢోకా లేదు అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా శాఖాహారుల్లో విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. ఎండలో తిరగకపోవడం వల్ల భారతదేశం లాంటి ఉష్ణమండల దేశంలో కూడా విటమిన్ డి లోపం సర్వసాధారణం అయిపోయింది.
ఇక మహిళల్లో రక్తహీనత (ఎనీమియా) ఒక పెద్ద సవాలుగా మారింది. ఆహారంలో సరైన కాంబినేషన్ లేకపోవడం వల్ల మనం తినే ఆహారంలోని ఐరన్ శరీరానికి వంటపట్టదు.
అద్భుతాలు చేసే చిన్న అలవాట్లు
-ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, పప్పులు, నట్స్ రోజూవారీ డైట్ లో కచ్చితంగా ఉండాలి.
-ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాలు ఉదయం ఎండలో గడపాలి. ఇది విటమిన్ డి ని అమాంతం పెంచుతుంది.
-సరైన సమయానికి భోజనం చేయాలి. ప్రతి పూట ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.
-ఐరన్ ఉన్న ఆహారాలు.. ఆకుకూరలు వంటివి తీసుకున్నప్పుడు, దానికి నిమ్మకాయ లాంటి విటమిన్ సి జతచేస్తే శరీరం దాన్ని సులభంగా గ్రహిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications