Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
శానిటరీ ప్యాడ్స్ కంటే మెన్‌స్ట్రువల్ కప్పులే నయమా.. నిజమెంతో మీరో చూడండి!
మెన్‌స్ట్రువల్ కప్పుల గురించి గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. శానిటరీ న్యాప్ కిన్‌లు, టాంపోన్లకు మెన్‌స్ట్రువల్ కప్పులు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నారు. ప్యాడ్స్ తో పోలిస్తే మెన్‌స్ట్రువల్ కప్ ధర కాస్త ఎక్కువే అయినా.. ఎక్కువ రోజులు వాడతారు కాబట్టి.. ప్యాడ్స్ కంటే తక్కువ ధర కిందకే వస్తుంది.
అలాగే మెన్‌స్ట్రువల్ కప్స్ సురక్షితమైనవి కూడా. ఇటీవల వీటి వాడకం ఎక్కువైంది. ప్యాడ్లు, టాంపోన్ల వలే ఇవి లీకవ్వవు. వీటితో పోలిస్తే చాలా సరుక్షితమైనవి కావడంతో ఎక్కువ మంది వీటిని వినియోగిస్తున్నారు. 70 శాతం మంది మెన్ స్ట్రువల్ కప్పులను వినియోగిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

లీక్ కావు, ఇన్ఫెక్షన్లు రావు:
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలకు శానిటరీ న్యాప్ కిన్లు అందుబాటులో లేవని పీర్ రివ్యూడ్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించింది. నెలసరి సమయంలో ప్యాడ్లు, టాంపోన్లు వంటివి అందుబాటులో లేక చాలా మంది మహిళలు ఉద్యోగాలకు, చిన్నారులు బడికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. నాసిరకమైనవి వాడడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కారణాల వల్ల మెన్ స్ట్రువల్ కప్పులు చాలా ఉపయోగవంతమైనవని తెలుస్తోంది. వీటిని ఒకసారి కొనుగోలు చేస్తే ఐదేళ్ల వరకు విరివిగా వాడొచ్చు. దీని వల్ల నెలనెలా కొంత డబ్బును మీరు సేవ్ చేసుకోవచ్చు.
ప్యాడ్లతో ఉండే సమస్యలు కప్పులతో ఉండవు:
మెన్ స్ట్రువల్ కప్పులను గ్రేడ్ సిలికాన్, రబ్బరు లేదా రబ్బరు పాలతో తయారు చేస్తారు. ప్యాడ్లు, టాంపోన్ల వలే ఇవి రక్తాన్ని పీల్చుకోకుండా సేకరిస్తాయి. ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్లకు ఇది మరింత ఉపయోగపడుతుంది. లీకయ్యే అవకాశం కూడా ఉండదు. టాంపోన్లను యోనిలో చొప్పించినపుడు బయటకు వచ్చే రక్తంతో పాటు యోని తేమను కూడా అది పీల్చుకుంటుంది. దీనివల్ల యోని pH సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ మెన్ స్ట్రువల్ కప్పుల వల్ల ఇలా జరిగే అవకాశమే ఉండదు.
చర్మ అలెర్జీలు రావు:
మెన్ స్ట్రువల్ కప్పులు.. టాంపోన్లు, ప్యాడ్లకంటే ఎక్కువ బ్లీడింగ్ ను ఆపగలవు. లీకయ్యే అవకాశం ఉండదు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు ప్యాడ్లు, టాంపోన్ల కంటే కప్పులే చాలా బాగా ఉపయోగపడతాయి. లీకేజీ అవకాశం లేనందున అర్థరాత్రుళ్లు వీటిని వాడడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పడుతుంది. ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ప్యాడ్లు వాడడం వల్ల చాలా మందికి దద్దుర్లు వస్తుంటాయి. అలాగే టాంపోన్లలో ఉపయోగించే కృత్రిమ పరిమళాలు, సువాసనల వల్ల చర్మ అలెర్జీలు, చర్మంపై చికాకును కల్గించేలా ఉంటాయి. కానీ కప్పుల వల్ల ఇలాంటి సమస్యలేమీ ఉండవు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications