Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వేసవిలో బయటకెళ్తున్నారా ఇవి వెంటే ఉంచుకోండి, ఏంటో తెలుసా?
ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఉదయం పది పదిన్నర అయిందంటే చాలు సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఐదున్నర అయినా ఎండ వేడిమి తగ్గడం లేదు.
ఎర్రటి ఎండలో బయటకు వెళ్లాలంటే సాహసమనే చెప్పాలి. ఈ ఎండలకు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. వేసవిలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంట్లో నుండి కాలు బయట పెట్టేముందు కొన్ని వస్తువులు తప్పనిసరిగా వెంటే ఉంచుకోండి. వాటి వల్ల ఎండవేడిమి నుండి కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సన్‌స్క్రీన్:
వేసవిలో బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా చర్మంపై సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి. దీని వల్ల హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే చర్మ క్యాన్సర్ కు కూడా కారణమయ్యే యూవీ కిరణాలను చర్మానికి తగలకుండా ఉండొచ్చు. అధిక ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ఎంచుకోవడం మర్చిపోవద్దు. అలాగే సన్‌స్క్రీన్ ను వెంట తీసుకెళ్లడం ద్వారా ప్రతి 2, 3 గంటలకు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు.
వాటర్ బాటిల్:
వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ కు గురవుతారు. పుష్కలంగా నీరు తాగడం ద్వారా హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. ఎండాకాలంలో దాహం కూడా ఎక్కువగా వేస్తుంది. అలాంటప్పుడు వాటర్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేకుండా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.
సన్ గ్లాసెస్:
సన్ గ్లాసెస్ ఒక ఫ్యాషన్ యాక్సెసరీగా మాత్రమే చూడొద్దు. సూర్య కిరణాల నుండి కళ్లను కాపాడుకునేందుకు సన్ గ్లాసెస్ ఉత్తమమైనవి. సూర్య కిరణాల వల్ల కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. యూవీ ప్రొటెక్టెడ్, పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ వాడాలి.

క్యాప్:
ఎండకు బయటకు వెళ్తే టోపీ ధరించడం మర్చిపోవద్దు. క్యాప్ పెట్టుకోవడం వల్ల తల, ముఖం, మెడ అన్నీ సూర్య కిరణాలకు గురికాకుండా ఉంటాయి. నేరుగా ముఖంపై సూర్య కిరణాలు పడటం వల్ల వచ్చే చాలా సమస్యలను టోపీతో నివారించవచ్చు.
తేలికపాటి దుస్తులు:
వేసవిలో చల్లగా, సౌకర్యవంతంగా ఉండటానికి తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. బిగుతుగా ఉన్న బట్టలు వేసుకోవడం వల్ల వేడిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎండ వేడిమి నుండి చల్లగా ఉంచుకోవడానికి కాటన్, జూట్, రేయాన్ వంటి దుస్తులు ధరించడం మర్చిపోవద్దు. అలాగే అవి లేత రంగుల్లో ఉండేట్లు చూసుకోవాలి.
వెట్ వైప్స్:
వేసవిలో చెమట వచ్చి ముఖం జిడ్డుగా మారుతుంది. జిడ్డుగా మారిన ముఖంతో చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. కొందరిలో చెమట వచ్చి ఉప్పు తేలుతుంది. చిరాకును కలిగించే వీటి నుండి దూరంగా ఉండేందుకు వెట్ వైప్స్ వెంటే ఉంచుకోవాలి. వీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు తేమగా మార్చుకోవచ్చు. అలోవెరా, లెమన్, టీ ట్రీ ఆయిల్ వంటి వాటితో వచ్చే వెట్ వైప్స్ వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. వీటిని తరచూ ఉపయోగించడం వల్ల ముఖం అందంగా ఉంటుంది. జిడ్డు తొలగిపోతుంది. చర్మ కణాలకు పోషకాలు అందుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
