Latest Updates
-
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం!
అమ్మమ్మల కాలం నాటి సౌందర్య చిట్కా.. వీటితో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం.!
మార్కెట్‌లో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ చూస్తుంటాం. ఫారిన్ బ్రాండ్ల పేరుతో కుప్పలకొద్దీ క్రీమ్స్, బాడీ లోషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఇవేమీ లేవు. అయినా సరే మన పూర్వీకుల చర్మం కాంతివంతంగా నిగారించేది. అందుకు కారణం వారు ఉపయోగించే సహజసిద్ధమైన సౌందర్య సాధనాలు. మీరు కూడా అలాంటి నిగారింపును సొంతం చేసుకోవాలంటే ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

మన అమ్మమ్మల కాలంలో చర్మ సమస్యలకు సంబంధించి ఏ పరిష్కారమైనా వంట గదిలోనే దొరికేది. ముఖంపై నల్లటి మచ్చలు ఉన్నా, ముడతలు ఉన్నా, కాంతివంతంగా ఉండాలంటే ప్రకృతి ఇచ్చే వాటితోనే సమస్యలు తీరిపోయేవి. వంటగదిలో ఆలిన్ నూనె, తేనె, పెరుగు ఉంటే చాలు రాత్రికి రాత్రే నిగారించే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
తేనెతో కాంతి
తేనెలో అద్భుతమైన చర్మ సంరక్షణ లక్షణాలు ఉన్నాయి. ముఖంపై మొటిమలు, వాపు ఉన్న వారికి బెస్ట్ ఛాయిస్. తేనెను ముఖంపై మర్దన చేసుకోవడం ద్వారా ఇది తేమతో కలిసి బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వడకట్టని పచ్చని తేనెను శుభ్రమైన, పొడి చర్మంపై 20 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇందులో సహజ యాంటీబయాటిక్ హైడ్రోజన్ పెరాక్సైడ్.. చర్మానికి పోషణనిచ్చి మృదువుగా చేసి కాంతిని ఇస్తుంది.
ఆలివ్ నూనెతో నిగారింపు
ఆలివ్ నూనెలోని ఒలిక్ ఆమ్లం, విటమిన్ ఇ, కె, పాలీఫెనాల్స్ దెబ్బతిన్న చర్మం పొరను కాపాడుతుంది. స్కిన్‌పై లిపిడ్ పొరను బాగు చేస్తుంది. స్నానం చేసిన తర్వాత తడి చర్మంపై ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను పలుచని పొరలా రాసుకోవాలి. మరింత సంరక్షణ కోసం ఆలివ్ నూనెలో నిమ్మరసం కూడా కలిపి పొడిబారిన చేతులు, మోకాళ్లపై రుద్దడం ద్వారా ఫలితం ఉంటుంది.
పెరుగుతో మచ్చలు మాయం
పెరుగులోని లాక్టిక్ యాసిడ్.. చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. జిగురును వేరు చేసి కాంతివంతమైన పొరను ఏర్పరుస్తుంది. ముఖంపై ఎర్రటి మచ్చలు, చిరాకును తొలగించి సున్నితంగా చేస్తుంది. పెరుగును ముఖానికి 15 నిమిషాల పాటు మర్దనా చేసి ప్యాక్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెరుగులో కొంచెం చిటికెడు పసుపు కలిపితే చర్మంపై పడిన రంధ్రాలను తొలగిస్తుంది. ఈ విధంగా వారానికి రెండు లేదా ముడు సార్లు చేయడం ద్వారా మీ చర్మానికి సంరక్షణ ఏర్పడి కాంతివంతంగా మారుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
