Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
Summer Dry Mouth: ఈ ఎండాకాలంలో నోరు పొడిబారుతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
తరచుగా దాహం వేస్తోందా? 2-3 గ్లాసుల నీరు తాగిన తర్వాత కూడా నోరు పొడిబారినట్లు అనిపిస్తుందా? నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల నోరు పొడిబారుతుంది. దీనినే జిరోస్టోమియా అంటారు. ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్యే. ఈ సమస్య ఉన్న వ్యక్తులు ఆహారం మింగడంలో కూడా ఇబ్బంది పడతారు. పెదాలు పగిలిపోతాయి. అలాగే నోటి దుర్వాసన వేధిస్తుంది.
వేసవికాలంలో నోరు పొడిబారడం సర్వసాధారణం. వేసవిలో శరీరం సాధారణంగానే తక్కువ లాలాజలం ఉత్పత్తి చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. దానిని నివారించే చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నోరు పొడిబారడం లక్షణాలు:
* నోటిలో జిగట, పొడిబారడం
* మాట్లాడటం, మింగడం కష్టంగా మారుతుంది
* నోరు లేదా నాలుకలో మంట
* జలదరింపు అనుభూతి
* పొడి పెదాలు, పెదాలు పగలడం
* దాహం పెరగడం
* నోటి దుర్వాసన
* గొంతులో మంట
* రుచి లేదా వాసనలో మార్పులు
వేసవికాలంలో నోరు పొడిబారడానికి కారణాలు:
* డీహైడ్రేషన్:
వేడి వాతావరణంలో, శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తుంది.
* ఎయిర్ కండిషనింగ్:
ఇంట్లో, ఆఫీసుల్లో ఏసీ వాడకం వల్ల గాలి పొడిగా మారుతుంది. దీని వల్ల కూడా నోరు పొడిబారుతుంది.
* అవుట్‌డోర్ యాక్టివిటీస్:
స్పోర్ట్స్ లేదా ఎక్సర్‌సైజ్ వంటి అవుట్‌డోర్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వల్ల నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవచ్చు. దీని వల్ల నోరు పొడిబారుతుంది.
* కొన్ని రకాల మందులు:
యాంటిహిస్టామైన్‌లు, డైయూరిటిక్‌లు, యాంటిడిప్రెసెంట్స్ వంటి కొన్ని మందుల వల్ల నోరు పొడిగా మారవచ్చు.
* ధూమపానం:
స్మోకింగ్ వల్ల కూడా నోరు పొడిబారుతుంది.
* చక్కెర పానీయాలు, కెఫిన్:
వేసవికాలంలో జ్యూసులు, కూల్ డ్రింక్స్, కాఫీలు, టీల వల్ల కూడా నోరు పొడిబారుతుంది.
నోరు పొడిబారడానికి నివారణ చిట్కాలు:
* పుష్కలంగా నీరు తాగాలి:
రోజంతా పుష్కలంగా నీరు తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. దీని వల్ల నోరు పొడిబారకుండా చూసుకోవచ్చు.
* చక్కెర లేని గమ్ నమలాలి:
చూయింగ్ గమ్ నమలడం ద్వారా నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల నోరు పొడిబారకుండా చూసుకోవచ్చు.
* హ్యూమిడిఫైయర్‌ని ఉపయోగించాలి:
రాత్రిపూట హ్యూమిడిఫైయర్ ను ఉపయోగించడం వల్ల గాలికి తేమ జోడించవచ్చు. తేమ గాలి వల్ల నోరు పొడిబారకుండా ఉంటుంది.
* కెఫిన్, పొగాకు, ఆల్కహాల్‌కు దూరం ఉండాలి:
కెఫిన్, పొగాకు, ఆల్కహాల్ వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల నోరు పొడిబారుతుంది. వేసవికాలంలో వీటికి దూరంగా ఉండటం మంచిది.
* నోటి పరిశుభ్రత పాటించాలి:
క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. ఫ్లాసింగ్ చేయడం వల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీని వల్ల నోరు పొడిబారకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications