Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
పాము కాటుకి సంజీవని లాంటి మొక్క ఇది..రసం పూస్తే 5 నిమిషాల్లో విషం విరుగుడు!
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో, పొలాల్లో, అడవుల్లో నివసించే ప్రజలు ఒక తెలియని భయంతో వణికిపోతుంటారు. ఆ భయానికి కారణం పాములు. ఎక్కడ నుంచి వస్తుందో, ఏ మలుపులో కాటేస్తుందో తెలియక, పాముకాటుకు గురైతే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందని ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ కి దూరంగా ఉండే చాలా గ్రామాల్లోని ప్రజలు హోం రెమెడీస్ మీద ఆధారపడతారు. అలాంటి హోం రెమెడీస్ లో ఆయుర్వేదం నుండి శాస్త్రీయ పరిశోధనల వరకు గుర్తింపు పొందిన ఒక అద్భుతమైన మొక్క ఉంది. అదే బోడ కాకరకాయ మొక్క.
బోడకాకరర కాయ చెట్టు ఆకులు, వేర్లలో దాగి ఉన్న ఔషధ గుణాలు దీనిని ఎంతో ప్రత్యేకమైనవిగా మారుస్తాయి. హాస్పిటల్స్, వైద్య సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని పాత రోజుల్లో గ్రామీణ ప్రజలు విషపూరిత జీవుల విషాన్ని తగ్గించడానికి ఈ మొక్కను విరివిగా ఉపయోగించేవారు. పాము కాటు వేసినప్పుడు ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి గాయంపై పూయడం, కొద్దిగా రసం తాగడం ద్వారా శరీరంలో విషం వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చని నమ్ముతారు.

ఆయుర్వేదంలో బోడకాకర ప్రాముఖ్యత, శాస్త్రీయ నిర్ధారణ
ఆయుర్వేదంలో బోడకాకర ఆకుల ఔషధ గుణాల గురించి విస్తృతంగా ప్రస్తావించారు. ఇది కేవలం పాము కాటుకే కాకుండా అనేక ఇతర విషపూరిత జంతువుల విషాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)రిపోర్ట్స్ కూడా ఈ ఆకులు విషాన్ని నిర్మూలించే లక్షణాలను కలిగి ఉందని స్పష్టం చేశాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈ మొక్క తాజా ఆకులు లేదా వేర్ల పేస్ట్ విషాన్ని తటస్థీకరించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వైద్య నిపుణులు నిర్వహించిన పరిశోధనలల్లో బోడకాకర మొక్క శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉందని వెల్లడైంది. ఈ మొక్కలో ఉండే పోషకాలు శరీరంలో విష ప్రభావాలను తగ్గించి, దానిని బయటకు పంపడంలో సహాయపడతాయని గుర్తించారు. అందుకే దీనిని సహజమైన యాంటీవెనమ్ (విష నిరోధకం) అని కూడా పిలుస్తారు.
5 నిమిషాల్లోనే ప్రభావం చూపే మొక్క?
చాలా మంది పురాతన వైద్యులు ఈ చెట్టు ఆకులు పాము విషంపై చాలా త్వరగా అంటే కేవలం 5 నిమిషాల్లోనే ప్రభావం చూపుతాయని నమ్ముతారు. అయితే,ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: ఇది కేవలం ప్రథమ చికిత్స మాత్రమే. హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండే విష నిరోధక మందు (యాంటీవెనమ్ ఇంజెక్షన్)కు ఇది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు. పాము కాటుకు గురైనప్పుడు మొదటి మరియు అత్యంత ముఖ్యమైన చర్య ఎప్పుడూ సమయాన్ని వృథా చేయకుండా వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి వెళ్లడం. డాక్టర్ల దగ్గర లభించే యాంటీవెనమ్ ఇంజెక్షన్ మాత్రమే విషానికి పూర్తి, సురక్షితమైన ట్రీట్మెంట్. బోడకాకర మొక్క బాధితుడు హాస్పిటల్ కి చేరుకునే వరకు మాత్రమే సహాయపడతాయి, విలువైన సమయాన్ని అందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
