Latest Updates
-
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.?
ఇంట్లో పనులతో ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండట్లేదా.. కిచెన్‌లోనే ఇలా కేలరీలు ఖర్చు చేయొచ్చు.!
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. అప్పుడే నరాలు ఉత్తేజితమై, ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. కానీ ఉరుకుల పరుగుల జీవితం, పోటీ ప్రపంచంలో కొందరు మహిళలకు అసలు పర్సనల్ టైం దొరకట్లేదు. ముఖ్యంగా ఇంటి పనులు, వృత్తిపరమైన బాధ్యతలతో అలసిపోతుంటారు. దీంతో వ్యాయామం చేసే ఓపికా, తీరికా ఉండవు. అలాంటి వారి కోసం ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ కీలక సలహాలు ఇస్తున్నారు.

హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్.. హోదా ఏదైనా పనులు వేరైనా ఇరు వర్గాల్లో ఒత్తిడి ఒకేలా ఉంటుంది. గృహిణులు ఉదయం లేచిన దగ్గర నుంచి వంట పని, ఇంటి పని, పిల్లల చదువులు, స్కూల్‌కి రెడీ చేయడం, పండుగలు, ఇతర కార్యక్రమాలు ఇలా తీరికలేని పనులతో సతమతమవుతుంటారు. దీంతో వారి ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరికా, ఓపికా రెండూ ఉండవు. ఈ క్రమంలో తెలియకుండానే బరువు పెరగడం, ఒత్తిడికి గురి కావడం జరుగుతుంటాయి.
ఇక ఉద్యోగం చేసే మహిళల్లోనూ కొందరు ఇంటి పనులు కూడా చూసుకుంటూ మరింత బిజీ అయిపోతుంటారు. ఉదయం లేచి వంట పని, ఇంటి పని పూర్తి చేసుకుని ఆఫీస్‌కి వెళ్లి మళ్లీ వచ్చాక డిన్నర్, పిల్లల కెరీర్ ఇలా రెస్ట్ లేకుండా గడుపుతుంటారు. ఇక వారాంతాల్లో వ్యక్తిగత పనులు, కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం లేదంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలా వీటితోనే సరిపోతుంది. దీంతో వారి ఆరోగ్యంపై దృష్టి సారించరు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఈ క్రమంలో మహిళలు వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోతే వారి కోసమే ఫిట్‌నెస్ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఇంట్లో పనులు చేసుకుంటూనే చిన్న చిన్న వ్యాయామాలు అవుతాయని.. దీంతో ఒత్తిడి, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు. అవి ఎలా చేయాలో చూద్దాం..
ఒకప్పుడు వంటలు కట్టెల పొయ్యి మీద చేసేవారు కాబట్టి ఎక్కువగా కూర్చునే వంట పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ స్టవ్‌లు.. వాటి కోసం కిచెన్ ప్లాట్‌ఫామ్‌లు. నిలబడే వంట చేయాలి. దీంతో మహిళల పాదాలపై ఒత్తిడి పడి త్వరగా అలసిపోతున్నారు. ఇందుకు పరిష్కారంగా కూరగాయలు కట్ చేయడం, ఒలవడం వంటి పనులు నేలపై ఆసనం వేసుకుని కూర్చుని పూర్తి చేయాలి. ఇలా చేయడం ద్వారా శరీరానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. పొట్ట చుట్టూ ఒత్తిడి పడి కొవ్వు ఏమైనా ఉన్నా ఇట్టే కరిగిపోతుంది.
అన్నం లేదా కూర స్టవ్‌పైన ఉడుకుతున్నప్పుడు పదే పదే కలుపుతూ ఉండకుండా ఆ సమయంలో చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా నరాలపై ఒత్తిడి తగ్గి చురుగ్గా పనిచేస్తాయి. పాదాలపై అదే పనిగా బరువు పడకుండా ఉంటుంది.
వంటగదిలో కింద షెల్ఫ్‌ల్లో వంట సామగ్రి తీసుకునేటప్పుడు మహిళలు వంగి తీసుకుంటారు. కానీ ఇలా కాకుండా చతికిలబడి కూర్చుని అవసరమైన వాటిని తీసుకోవడం ద్వారా వ్యాయామం చేసిన అనుభూతి కలుగుతుంది. కేలరీలు అధిక మొత్తంలో ఖర్చవుతాయి.
చాలా మంది మహిళలు వంట చేసే సమయంలో, కిచెన్ శుభ్రం చేసేటప్పుడు అదే పనిగా ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటారు. మనిషిక్కడ, మనసక్కడ చందంగా మారుతుంది. అలాంటి ఆలోచనలు కట్టిపడేయాలి. గతంలో జీవించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చేస్తున్న పనిపైన దృష్టి సారిస్తూ పనిని ఎంజాయ్ చేస్తూ, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తూ మంచి సంగీతం వింటూ పనులు చేసుకోవడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని.. నూతన ఉత్సాహంతో ఉంటారని చెబుతున్నారు. బిజీ బిజీ లైఫ్‌లో తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక లేని మహిళలు ఇంటి పనుల సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications