Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
ఈ విటమిన్ లోపంతో నిరంతరం అలసట, తిమ్మిర్లు.. ఈ హెల్తీ ఫుడ్స్‌తో ఉపశమనం
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సరైన మోతాదులో శరీరానికి విటమిన్లు, ప్రొటీన్, మినరల్స్ చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం కారణంగా వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా B12 లోపం కారణంగా ఎర్ర రక్త కణాల ఏర్పాటు, నాడీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా వివివధ సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఈ లోపాన్ని ఎలా అధిగమించాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..

శరీరానికి అత్యవసరమైన విటమిన్లలో బి12 ఒకటి. ఈ విటమిన్ సాధారణంగా జంతు ఆధారిత ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఈ క్రమంలో శాకాహారులు ఈ లోపాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కొన్ని వెజ్ ఆహార పదార్థాల్లోనూ ఈ విటమిన్ లభిస్తుంది. తద్వారా ఆహారంలో మార్పులతో పాటు జీవనశైలి మార్పుల ద్వారా ఈ విటమిన్ లోపాన్ని గణనీయంగా సరిదిద్దవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ B12 లక్షణాలు
విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్న వారు నిరంతరం అలసట, బలహీనతతో ఉంటారు. దీంతో కాసేపు కూడా పనిచేసే ఓపిక ఉండదు. చేతులు, పాదాల్లో తిమ్మిరి, జలదరింపు ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మాత్రమే కాకుండా చిన్న వయసులోనూ విటమిన్ B12 లోపంతో ఈ సమస్య ఏర్పడుతుంది. తరచుగా తల తిరుగుతున్నట్లు అనుభవిస్తారు. చర్మం పసుపు రంగులోకి మారుతుంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. మీలోనూ ఈ మార్పులు గమనించినట్లయితే విటమిన్ B12 లోపం తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ బి12 లోపానికి ఆహార పదార్థాలు..
శరీరంలో విటమిన్ B12 లోపాన్ని సరిదిద్దడానికి పాలు, పాల ఉత్పత్తులు ఉత్తమమైన మార్గమని నిపుణులు అంటున్నారు. వీటి ద్వారా విటమిన్ B12ను సులభంగా పొందవచ్చు. శాకాహారులకు మంచి ఆప్షన్. పాలు, పెరుగు, పనీర్, జున్ను వంటి పాల ఉత్పత్తులను తరచూ తీసుకోవడం ద్వారా ఫలితం ఉంటుంది. వీటి ద్వారా విటమిన్ బి12 మాత్రమే కాకుండా కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి.
గుడ్లు, మాంసాహారం
నాన్ వెజ్‌ను ఇష్టపడేవారు మాంసాహారం ద్వారా పుష్కలంగా విటమిన్ B12 పొందవచ్చు. గుడ్లు, చేపలు, చికెన్, మటన్ ద్వారా విటమిన్ B12 లభిస్తుంది. గుడ్డు సొన ద్వారా ఈ విటమిన్‌ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. అంతేకాకుండా చేపలు, చికెన్‌లో ప్రోటీన్, పోషకాలను శరీరం గ్రహిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా, సరైన మోతాదులో తీసుకుంటే ఫలితం ఉంటుంది.

బలవర్ధక ఆహార పదార్థాలు
పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు బలవర్ధమైన ఆహార పదార్థాల ద్వారా విటమిన్ B12ను పొందవచ్చు. అంటే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఇవి బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు, బాదం పాలు వంటి మొక్కల ఆధారంగా లభించే పాలు, న్యూట్రిషనల్ ఈస్ట్ ద్వారా ఈ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. తరచూ వీటిని తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
వైద్యుల సలహా
విటమిన్ బి12 సమస్య తీవ్రంగా ఉన్నవారికి కేవలం ఆహార పదార్థాల ద్వారా ఆ లోపాన్ని సవరించడం కష్టం. బి12 లోపం లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచన మేరకు విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి చికిత్స వయసు, ఆరోగ్య పరిస్థితులు, విటమిన్ లోపం తీవ్రత ద్వారా నిర్ణయిస్తారు. సరైన పరీక్షలు, డాక్టర్ సిఫార్సు మేరకు మాత్రమే చికిత్స అందిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
