Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్
రకరకాల వంటకాలతో విందు భోజనం నోరూరించినా.. ఒక ముద్ద పెరుగన్నం లేకపోతే.. సంతృప్తి ఉండదు. ఏది తినాలనిపించకపోయినా.. కాస్త పెరుగన్నం తినడం వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కొంతమంది పెరుగును చూస్తే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ.. పెరుగులో ఉన్న పోషకవిలువలు, ప్రయోజనాలు తెలుసుకుంటే.. మీకే పెరుగు తినాలి అనిపిస్తుంది.
శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో పెరుగు ప్రధానమైనది. ఒకపూట భోజనానికి సమానమయ్యే పెరుగన్నం రెండున్నర గంటల వరకు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుని మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి. పెరుగు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

100 గ్రాముల పెరుగులో
శాఖహార భోజనంలో పెరుగు కీలకం. 89 శాతానికి పైగా నీటిని కలిగి ఉండే పెరుగులో నాణ్యమైన ప్రోటీన్లు, దాదాపు అన్ని రకాల ఎమినో యాసిడ్‌లు, కాల్షియం తగినస్థాయిలో లభిస్తాయి. కాబట్టి నిత్యం పెరుగును తీసుకోవడం మానకండి.

జీర్ణశక్తి
ఆహారం జీర్ణం కావడానికి పెరుగు తోడ్పడుతుంది. ఇందులో ఉన్న పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు సహకరిస్తాయి.

రోగనిరోధక శక్తి
పెరుగులో శరీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. శరీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

ఎముకల బలానికి
పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి. కాబట్టి నిత్యం పెరుగు తీసుకుంటే.. ఎముకల ఆరోగ్యానికి మంచిది.

గుండె ఆరోగ్యం
పెరుగు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి రక్తపోటుని అదుపులో ఉంచే శక్తి ఉంటుంది. రక్తనాళాల్లో, శరీరంలో కొవ్వు చేరకుండా నివారించే శక్తి పెరుగుకు ఉంటుంది.

బరువు తగ్గడానికి
బరువు తగ్గించడంలో పెరుగు బాగా తోడ్పడుతుంది. పెరుగులో ఉన్న క్యాల్షియం శరీరంలో కార్టిసాల్ అనే స్టిరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. ఈ కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువైనా, సమతౌల్యం కోల్పోయినా జీవనశైలికి సంబంధించిన వ్యాధులు హైపర్ టెన్షన్, ఒబెసిటీ లాంటివి వస్తాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ డైట్ లో పెరుగు ఉండాల్సిందే.

కురుల ఆరోగ్యానికి
పెరుగులో ఉండే విటమిన్ సి, జింక్, క్యాల్షియం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలున్న లాక్టిక్ యాసిడ్ కురుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పెరుగును తలకు అప్లై చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

పెరుగు తీసుకోవడం అవసరం
కొంతమందికి పాలు, పాల వాసన అంటే సరిపోవు. ఇలాంటివారికి పాలలో ఉన్న లాక్టోజ్ ప్రొటీన్ అందదు. కాబట్టి పెరుగునైనా తీసుకుంటే లాక్టోజ్‌ని లాక్టిక్ ఆసిడ్ రూపంలో పొందవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.

ఒత్తిడి
పెరుగు తింటే.. పొట్టలో చల్లగా ఉండటమే కాదు.. మెదుడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.

పైల్స్
మొలల సమస్యతో బాధపడేవాళ్లకు పెరుగు చక్కటి పరిష్కారం. నిత్యం పెరుగన్నం తీసుకుంటే.. పైల్స్ ను అరికడుతుంది. పెరుగన్నానికి కాస్త అల్లం జోడించి తింటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
