Latest Updates
-
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.?
హార్ట్ అటాక్, క్యాన్సర్ వంటి ప్రమాధకర జుబ్బులను నివారించే ఆపిల్ తొక్క
ఆపిల్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి రోజూ ఓ ఆపిల్ తింటే వైద్యుని అవసరం ఉండదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఆపిల్ పండులో ఉండే పోషకవిలువలు అలాంటివి మరి. ఒక్క పండులో మాత్రమే కాదు, ఆపిల్ తొక్కలో కూడా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. చాలా వరకూ ఆపిల్ పండులోకంటే ఆపిల్ తొక్కలోనే ఎక్కువ పోషకాలున్నట్లు కొన్ని పరిశోధన ద్వారా కూడా వెల్లడైంది.
ఆపిల్ తొక్క ఆరోగ్యకరమా? ఆపిల్ తొక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే..
READ MORE: యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..!
ఆపిల్ తినేముందు తొక్క తొలగించకండి. తొక్క తొలగించడం వల్ల అందులోని న్యూట్రీషియన్ విలువలు తగ్గిపోతాయి . కాబట్టి ఆపిల్ తినాలనుకొన్నప్పుడు శుభ్రంగా కడిగి, పొట్టుతో సహాయపఅలాగే తినాలి. అప్పుడే ఆరోగ్యానికి ఎక్కువ లాభం. మరి ఆపిల్ తినే ముందు ఈ క్రింది విషయాలను తప్పకుండా గుర్తించుకుంటారు కదూ..!

శ్వాస మరియు ఊపిరితిత్తుల సమస్య:
ఆపిల్ ను పొట్టుతో సహా తీసుకోవడం వల్ల ఇది శ్వాస సమస్యను నివారిస్తుంది. ఆపిల్ తొక్కలో ఉండే క్యూరిస్టిన్ అనే కంటెంట్ వల్ల ఊపిరితిత్తులు సరిగా పనిచేయడానికి సహాయపడుతాయి.

జ్ఝాపకశక్తి తగ్గిపోకుండా రక్షణ కల్పిస్తుంది:
ఆపిల్ తొక్కలో ఉండే క్యూరిస్టిన్ జ్ఝాపకశక్తి తగ్గిపోకుండా బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణకల్పిస్తుంది. ఏకాగ్రతను పెంపొందిస్తుంది మరియు మతిమరుపును నివారిస్తుంది . ఆపిల్ తొక్క వల్ల ఒది ఒక ఉత్తమ ప్రయోజనం.

డయాబెటిస్:
ఆపిల్ తొక్క బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఆపిల్ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్టార్చ్ ను షుగర్స్ గా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్ ను చురుగా ఉంచుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు.

కళ్ళ సమస్యలు:
ఆపిల్ తొక్క కాంట్రాక్ట్ ప్రమాధాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ గా ఆపిల్ తొక్కతో పాటు తినడం వల్ల కళ్ళ యొక్క ఆరోగ్యంను కాపాడుకోవచ్చు.

గాల్ స్టోన్(పిత్తాశయంలో రాళ్ళు):
ఆపిల్ తొక్కలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పకుండా నివారిస్తుంది . గాల్ బ్లాడర్ లో రాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల ఏర్పడుతాయి. కాబట్టి, ఆపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది .

దంతాల ఆరోగ్యం:
ఆపిల్ తొక్క దంతక్షయాన్ని మరియు చిగుళ్ళ వ్యాధిని నివారిస్తుంది. తొక్కతో పాటు, ఆపిల్ ను నమిలి తినడం వల్ల దంతాలు మంచి షైనింగ్ తో తెల్లగా మారుతాయి మరియు నోట్లో ఆరోగ్యకరమైన లాలాజలం ఉత్పత్తి అవుతుంది .

అనీమియా:
గర్భధారణ సమయంలో తొక్కతోపాటు ఆపిల్ ను తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఇది చాలా మేలు చేస్తుంది . ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది . అంతే కాదు ఆపిల్ తొక్కలో క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, మరియు జింక్ అధికంగా ఉన్నాయి. అనీమియాతో బాధపడే వారికి ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి:
ఆపిల్ తొక్కలో ఉండే క్యాల్షియం, ఎముకల ఆరోగ్యానికి సహాయడుతుంది. బోన్ హెత్త్ కు క్యాల్షియం చాలా అవసరం. క్యాల్షియం లోపం వల్ల మనిషి బలహీనంగా మరియు ఓస్టిరియోపోసిస్ తో బాధపడుతుతంటారు .

బరువు తగ్గడానికి :
ఆపిల్ తొక్కలో యూర్సోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది . మీరు ఊబకాయంతో బాధపుడుతున్నట్లైతే మీరు ఆపిల్ ను తీసుకోవాలి.

వ్యాధుల నుండి రక్షన కల్పిస్తుంది:
ఆపిల్ తొక్కలో ఫ్లెవనాయిడ్స్, ఫైటోకెమికల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి.

వివిధ రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తాయి:
ఆపిల్ తొక్కలో ట్రైటర్ ఫినాయిడ్స్ అనే కాంపౌడ్స్ ఉన్నాయి. వీటిలో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇవి కాలేయం, బ్రెస్ట్ మరియు కోలన్ వంటి పెద్ద పెద్ద క్యాన్సర్ జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి.

హార్ట్ మరియు గాస్ట్రోఇన్టెన్షినల్ హెల్త్:
ఆపిల్ తొక్కలో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్స్ పుష్కలంగా ఉన్నాయి. చాలా వరకూ ఫైబర్ కంటెంట్ ను ఆపిల్ తొక్కలోనే కనుగొనబడినది . ఈ ఫైబర్ హార్ట్ సంబంధిత జబ్బులైన హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ తగ్గించడం నివారిస్తుంది. మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.



Click it and Unblock the Notifications