Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
రోజూ వీటిని ఎలా తీసుకుంటున్నారు.?.. ఆరోగ్యం విషయంలో నేటికీ మారని కొన్ని అపోహలు.!
నేటి కాలంలో ఆరోగ్యానికి సంబంధించి చాలా మందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఆధునిక యుగంలో సోషల్ మీడియా ద్వారా సులభంగా సమాచారం తెలుసుకోగలుగుతున్నాం. అయితే కొందరు తప్పుడు సమాచారం ఆధారంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవండ ద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తద్వారా శరీరానికి హాని కలుగజేస్తుంది ప్రజలు సాధారణంగా విశ్వసించే ఆరోగ్య అపోహలు, వాటి వెనుక నిజాలు తెలుసుకుందాం..

యాంటీబయాటిక్స్
యాంటీబయాటిక్స్ ప్రతి వ్యాధిని నయం చేస్తాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటీబయాటిక్స్ కేవలం బాక్టీరియా ఇన్ఫెక్షన్లపై మాత్రమే పోరాడతాయి. జలుబు, ఫ్లూ, వైరల్ జ్వరాల వంటి వైరల్ ఇన్ఫెక్షన్లపై ఇవి అంతగా ప్రభావం చూపించవు. వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ అనారోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్ వాడాలి. లేదంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
చెమట- కొవ్వు
బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం సమయంలో చెమట ఎక్కువగా పడితే కొవ్వు కరుగుతుందని భావిస్తారి. అది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే క్రమంలో చెమట పడుతుంది. చెమట పట్టడం ద్వారా నీరు బయటకు పోతుందే కానీ కొవ్వు కరిగిపోదు. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా మాత్రమే కొవ్వు కరుగుతుంది.
సన్నగా ఉండేవాళ్లలోనే ఆరోగ్యం
సన్నగా ఉండేవాళ్లు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారనేది కొందరు అపోహ పడుతుంటారు. కేవలం వ్యక్తి బరువుపైన మాత్రమే వారి ఆరోగ్యం ఆధారపడి ఉండదని నిపుణులు అంటున్నారు. శారీరక ఫిట్‌నెట్, బీపీ లెవెల్స్, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, జీవనశైలి ఆధారంగా మాత్రమే వ్యక్తి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
రాత్రి సమయంలో పండ్లు
పండ్లు రాత్రి సమయంలో కాకుండా ఉదయం పూట మాత్రమే తీసుకోవాలని కొందరు భావిస్తారు. రాత్రిళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమనేది అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. డిన్నర్ టైంలో పండ్లు తినడం సురక్షితమేనని.. అయితే మధుమేహం, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు పోషకాహార నిపుణుల సలహా మేరకు పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చల్లటి నీళ్లు తాగితే జలుబు
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందని భావించడం కేవలం అపోహ మాత్రమే. జలుబు అనేది వైరల్ ఇన్‌ఫెక్షన్ల ద్వారా మాత్రమే వస్తుంది. అయితే గొంతు సమస్యలు ఉన్నవారు చల్లటి నీళ్లు తీసుకోవడం శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు.
డిటాక్స్ పానీయాలు
డిటాక్స్ పానీయాలూ తీసుకోవడం ద్వారా శరీరం నుంచి విషపదార్థాలు సులభంగా బయటకు పోతాయని చాలా మంది భావిస్తారు. ఇది కేవలం అపోహ మాత్రమే. కాలేయం, మూత్రపిండాలు సహజంగానే వాటి విధులు నిర్వర్తిస్తాయి. కేవలం డిటాక్స్ పానీయాల ద్వారా మాత్రమే శరీరం పూర్తిగా శుభ్రపడదని చెబుతున్నారు.

పరిమితికి మించి నీరు
శరీరానికి ఏదైనా సరే ఒక మోతాదు వరకు మాత్రమే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతకుమించి తీసుకోవడం హాని చేస్తుందని అంటున్నారు. రోజూ 3 లీటర్ల వరకు నీరు మాత్రమే నీరు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎక్కువగా నీరు తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గి హాని చేస్తాయి. దాహం, అవసరాలకు అనుగుణంగా మాత్రమే నీరు తాగాలి.
గుడ్లు
గుడ్లు తినడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. గుడ్లు పరిమిత మోతాదులో తీసుకుంటే శరీరానికి సురక్షితం. మీ రోజువారీ డైట్‌లో సమతుల్య ఆహారంతో పాటు గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
నొప్పి లేని వ్యాధి
సాధారణంగా ఏ వ్యాధి కూడా నొప్పి లేకుండా ఉండదని కొందరు అపోహ పడుతుంటారు. డయాబెటిక్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ వంటి కొన్ని తీవ్రమైన వ్యాధులకు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవు. దీంతో రోగ నిర్ధారణ ఆలస్యమవుతుంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా చికిత్స సులభతరమవుతుంది.
ఆయుర్వేద వైద్యం
మందులతో పోలిస్తే మూలికలు, ఆయుర్వేద ఆయుర్వేద ఉత్పత్తులు సురక్షితమని చాలా మంది భావిస్తారు. అయితే ప్రతి వ్యాధికి ఇదే చికిత్స సరైంది కాదని నిపుణులు అంటున్నారు. కొన్ని మూలికా ఉత్పత్తులు మందులతో చర్య జపినా మరికొన్ని దుష్ప్రభావం కలిగిస్తాయని.. వైద్యుల సలహా మేరకే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
