Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్‌రూమ్‌కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.!
చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవగానే బెడ్ కాఫీ లేదా టీ అలవాటు. లేదంటే వారు కాలకృత్యాలు తీర్చుకోలేరు. కానీ ఇదే పద్ధతి రోజూ కొనసాగితే మీ ఆరోగ్యం రిస్క్‌లో పడినట్లే అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పరగడుపునే టీ, కాఫీ తాగితే ఏమవుతుంది.. శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.. ఇక్కడ చూద్దాం..

ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ కడుపులో పడనిదే మీకు మలవిసర్జన చేయలేకపోతున్నారంటే అది దీర్ఘకాలిక మలబద్ధకానికి సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమంగా మీ శరీరం దీనికి అలవాటుపడిపోవడమే కాక.. సహజంగా జీర్ణక్రియ పూర్తి చేసుకోలేక మెటబాలిజం బలహీనపడుతుంది. ఈ పరిస్థితి మన్ముందు మీ శరీర జీర్ణవ్యవస్థని మరింత దిగజార్చుతుంది.
డీ హైడ్రేషన్
మీ డైలీ రొటీన్ తాగు నీరు కాకుండా కేవలం కాఫీతోనే ప్రారంభమైనట్లయితే అది డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే రాత్రంతా నీళ్లు తాగకుండా ఉండటంతో ఉదయం మామూలుగానే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. కానీ అందుకు బదులుగా కాఫీ లేదా టీ తాగడం ద్వారా అందులోని ఆస్మోటిక్ లాక్సేటివ్ ప్రభావం పేగుల్లోకి నీటిని పీల్చుకుంటుంది. అది శరీరంలోని ఇతర భాగాల్లో కూడా నీటిని పూర్తిగా తగ్గించేస్తుంది. ఫలితంగా మలవిసర్జన పొడిగా, గట్టిగా మారి ఇబ్బంది పెడుతుంది.
ఉదయాన్నే మలవిసర్జన కోసం కెఫీన్ వంటి ఉత్ప్రేరకాలను అతిగా వాడటం మంచిది కాదు. దీని వల్ల జీర్ణవ్యవస్థ సహజ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలంలో మలబద్ధకం సమస్య మరింత తీవ్రమయ్యేలా చేస్తుంది. ఇక అల్సర్లు, దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో కాఫీ తాగినట్లయితే అది పేగు పొరకు చికాకు కలిగిస్తుంది. ఫలితంగా అల్సర్, గ్యాస్ సమస్యలు మరింతగా పెరుగుతాయి.

సాఫీ మలవిసర్జన కోసం
ఉదయం నిద్ర లేవగానే మల విసర్జన సాఫీగా సాగాలంటే ముందు రోజు భోజనంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు వంటి వాటిని భోజనంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ 25- 30 గ్రాములు ఫైబర్ ఉండేలా చూసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణవ్యవస్థ సహజ సామర్థ్యం మెరుగుపడుతుంది.
ముఖ్యంగా ప్రతిరోజూ శరీరాన్ని హైడ్రేడెట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మల విసర్జన సాఫీగా సాగాలంటే డీహేడ్రేషన్ సమస్యను నివారించాలి. ప్రతి రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఉదయం పరగడుపునే గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగినట్లయితే పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
మీకు ఉదయాన్నే మల విసర్జన సమస్యకి కాఫీ, టీ వంటివి తాత్కాలిక ఉపశమనం అందించినా అది మున్ముందు పేగు ఆరోగ్యం, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి దీర్ఘకాలిక మలబద్ధకానికి దారితీస్తుంది. అందుకే ఈ సమస్యకి కారణాలు తెలుసుకుని సమతుల్య పోషకాహారం తీసుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
