Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
మళ్లీ లాక్ డౌన్ తప్పదా? ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ సికాడా!
ప్రాణాంతకమైన కోవిడ్-19 మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మన మనస్సుల నుంచి ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. ఇంతలోనే ప్రపంచాన్ని మరో కొత్త వేరియంట్ భయపెడుతోంది. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అతలాకుతలం చేస్తోంది.
దీనికి తోడు ఎల్ పిజి గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, మళ్లీ కోవిడ్ నాటి లాక్‌డౌన్ పరిస్థితులు రాబోతున్నాయనే వదంతులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోస్తూ, ఓ కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తోంది.

ఇంతకీ ఈ కొత్త వేరియంట్ ఏంటి? ఎక్కడ గుర్తించారు?
వైరస్‌లు తమ రూపాన్ని మార్చుకోవడం (మ్యుటేషన్) వాటి సహజ లక్షణం. కరోనాకు కారణమయ్యే SARS-CoV-2 వైరస్ కూడా ఇలాగే మారుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సికాడా అనే కొత్త కోవిడ్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త కోవిడ్ వేరియంట్ కు సైంటిస్టులు..BA.3.2అని పేరు పెట్టారు.
అయితే వాడుక భాషలో దీనిని అనధికారికంగా సికాడా(Cicada) అని పిలుస్తున్నారు. భూమి అడుగున చాలా కాలం పాటు నిద్రావస్థలో ఉండి, అకస్మాత్తుగా గుంపులుగా బయటకు వచ్చే ఒక కీటకం పేరు ఈ సికాడా. ఈ వైరస్ ప్రవర్తన కూడా అచ్చం అలాగే ఉండటంతో దీనిని ఆ పేరుతో పిలుస్తున్నారు.
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (US CDC) నివేదిక ప్రకారం..సికాడా వేరియంట్ ను మొదటగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ సికాడా వేరియంట్ ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన మహా ముప్పు కాదు, ఇది మనకు అప్పటికే పరిచయమున్న ఒమిక్రాన్(Omicron) కుటుంబ వృక్షానికి చెందిన ఒక చిన్న ఉప శాఖ మాత్రమే. అయితే చాలా కాలం పాటు ఇది ఎవరి కంటా పడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయింది.
కానీ ఇప్పుడు 2026 ప్రారంభం నుంచి దీని కేసులు మళ్లీ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోని సగం రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ సికాడా వేరియంట్ ఎందుకంత ప్రమాదకరం?
సికాడా వేరియంట్ లో ఏకంగా 75 ఉత్పరివర్తనాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో వణికించిన JN.1 వేరియంట్ తో పోలిస్తే ఇవి రెండింతలు ఎక్కువ. ఇందులో అత్యధిక మార్పులు వైరస్ స్పైక్ ప్రోటీన్ పైనే జరిగాయి. ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే వైరస్ మన కణాల్లోకి సులభంగా చొరబడుతుంది.
వ్యాక్సిన్ల ద్వారా లేదా గతంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల మన శరీరంలో పుట్టుకొచ్చే యాంటీబాడీలు ప్రధానంగా ఈ స్పైక్ ప్రోటీన్ ను అడ్డుకునేలా రూపొందుతాయి. కానీ సికాడాలో ఈ ప్రోటీన్ పూర్తిగా రూపాంతరం చెందడం వల్ల ఇది మన రోగనిరోధక వ్యవస్థను సులభంగా ఏమార్చగలదని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు ఏమిటి?
సికాడా (BA.3.2) వేరియంట్ రోగనిరోధక శక్తిని తప్పించుకోవడంలో అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుందని ప్రయోగశాల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న వారిలోనూ, గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలోనూ ఉండే యాంటీబాడీలు ఈ కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడంలో అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు.
అయితే ఇది ప్రాణాలకు ఎంతమేర ముప్పు తెస్తుంది? దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? అనే విషయాలపై కచ్చితమైన అంచనాకు రావడానికి మరింత క్షేత్రస్థాయి డేటా అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండటం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
గుర్తించాల్సిన ప్రధాన లక్షణాలు ఇవే
మునుపటి కోవిడ్ లక్షణాలకు, దీనికి పెద్దగా తేడా లేదు. అయితే ఈ సికాడా వేరియంట్ సోకిన వారిలో ప్రధానంగా తీవ్రమైన, బాధాకరమైన గొంతు నొప్పి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటు మరికొన్ని లక్షణాలు ఏంటో ఇక్కడ చూడండి.
ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం
పొడి దగ్గు రావడం
చలి, తీవ్రమైన అలసటతో కూడిన జ్వరం
కండరాల నొప్పులు, తలనొప్పి
రుచి, వాసన కోల్పోవడం
కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
