మళ్లీ విజృంభిస్తున్న కరోనా..ఈ 5 హోం రెమెడీస్‌ తో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,866 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 564 కొత్త కేసు నమోదైనట్లు గురువారం ఉదయం కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన డేటా తెలిపింది. కొత్త వేరియంట్లు "LF.7, XFG,JN.1" కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఇక, గడిచిన నెల రోజుల్లో ఏడు కోవిడ్ మరణాలు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, ఢిల్లీకి చెందిన ఇద్దరు, కర్ణాటక రాష్ట్రానికి ఇద్దరు రీసెంట్ గా కోవిడ్ తో మరణించారు. ఈ ఏడుగురు మృతుల్లో 5 నెలల చిన్నారి కూడా ఉండటం ఆందోళనకర విషయం. శ్వాస సంబంధిత సమస్యలతో చిన్నారి చనిపోగా,మిగతా ఐదుగురు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారే. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మెడికల్ సప్లైస్ ని అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది.

కరోనా కేసులు చాపకిందనీరులా మెల్లగా పెరుగుతండటంతో అందరిలో మెల్లిగా టెన్షన్ మెదలైంది. ప్రభుత్వ గైడ్ లైన్స్, పరిశుభ్రతను పాటించడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం కూడా కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో మీకు సహాయపడుతుంది. అయితే కొన్ని హోం రెమెడీస్ ద్వారా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.

Rising COVID Cases Boost Your Immunity with These Home Remedies

అల్లం వెల్లుల్లి టీ
ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధాలు అల్లం, వెల్లుల్లి. ఈ రెండూ వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఈ రెండింటినీ కలిపి టీ చేసుకుని తాగితే మన ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుంది. అల్లంలో శరీరంలో మంటను తగ్గించే వైరస్ ‌లను ఎదుర్కొనే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు అల్లం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. వెల్లుల్లిలో శక్తివంతమైన సూక్ష్మక్రిములను నాశనం చేసే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన అల్లం,వెల్లుల్లిని కలిపి టీ చేసుకుని తాగితే మీ రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది.

Rising COVID Cases Boost Your Immunity with These Home Remedies

విటమిన్ సి ఫుడ్స్
మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలన్నా, ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడాలంటే శరీరానికి విటమిన్ సి అత్యవసరం. సాధారణంగా విటమిన్ సి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లు. ఇవి విటమిన్ సికి అద్భుతమైన వనరులు అనడంలో సందేహం లేదు. అయితే విటమిన్ సి కేవలం సిట్రస్ పండ్లలోనే కాదు క్యాప్సికమ్, జామపండ్లు, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు తగినంత విటమిన్ సిని పొందవచ్చు,మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది

.

Rising COVID Cases Boost Your Immunity with These Home Remedies

పసుపు,తేనె
భారతీయ వంటకాల్లో సర్వసాధారణంగా కనిపించే పసుపు కేవలం రంగు, రుచి కోసమే కాదు దాని అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం.. పసుపుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుందని నమ్ముతారు. రోజూ ఉదయాన్నే పసుపును గోరువెచ్చని నీరు, కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ పసుపు తేనె మిశ్రమం శరీరంలో మంటను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మొత్తంగా మీ రోగనిరోధక వ్యవస్థకు పూర్తి మద్దతు ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Rising COVID Cases Boost Your Immunity with These Home Remedies

నిద్ర, హైడ్రేషన్
తగినంత నిద్ర, శరీరంలో నీటి సమతుల్యత ఈ రెండూ మీ రోగనిరోధక శక్తికి అత్యంత కీలకమైన మద్దతు అందిస్తాయి. మీరు సరిపడా నిద్రపోనప్పుడు, మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం పెరుగుతుంది. రోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర మీ శరీరానికి విశ్రాంతినిచ్చి, వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తినిస్తుంది. అలాగే శరీరంలో తగినంత నీరు లేకపోతే సెల్యులార్ విధులు సరిగా పనిచేయవు. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది మీ శరీర రక్షణ వ్యవస్థలకు మద్దతునిస్తుంది. కాబట్టి రోజూ తగినంత నీరు తాగడం మర్చిపోకండి. ఈ రెండు అలవాట్లను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా, దృఢంగా తయారవుతుంది.

Rising COVID Cases Boost Your Immunity with These Home Remedies

తులసి టీ.. రోగనిరోధక శక్తికి సంజీవని

భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా పూజలందుకునే తులసి కేవలం మతపరమైన ప్రాముఖ్యతనే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిని ఆయుర్వేదంలో ఒక దివ్యౌషధంగా పరిగణిస్తారు. తులసికి ఉన్న అడాప్టోజెనిక్ లక్షణాలు శరీరం ఒత్తిడికి అనుగుణంగా మారడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. తులసి ఆకుల్లో ఎన్నో శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ మహమ్మారి సమయంలో తులసి టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion