Latest Updates
-
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
Walking vs Running: వాకింగ్, రన్నింగ్ లో ఆరోగ్యానికి ఏది బెస్ట్? బరువు తగ్గాలంటే ఏది చేయాలి?
వాకింగ్ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రన్నింగ్ కూడా మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. వాకింగ్,రన్నింగ్ రెండూ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అత్యంత అనుకూలమైన, సమర్థవంతమైన వ్యాయామాలు. బరువు తగ్గడానికి, గుండెను బలంగా ఉంచుకోడానికి, మానసిక ఆరోగ్యం కోసం వాకింగ్,రన్నింగ్ అద్భుతమైన వ్యాయామాలే అయినప్పటికీ మీ శరీరానికి, మీ జీవనశైలికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం.
మొదలు పెట్టడానికి ఏది సులభం?
నడవడానికి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. మంచి చెప్పులు ఉంటే చాలు. కానీ రన్నింగ్ కు అలా కాదు.. మంచి క్వాలిటీ షూస్, సరైన వార్మ్ అప్స్, కొంత ఓర్పు అవసరం. కాబట్టి అన్ని ఫిట్ నెస్ లెవల్స్ వాళ్లకి వాకింగ్ చాలా బెటర్.

గుండె ఆరోగ్యం కోసం ఏది మంచిది
గుండెను బలంగా ఉంచడంలో పరుగు, నడక రెండూ సహాయపడతాయి. అయితే రన్నింగ్ మరింత తీవ్రమైన వ్యాయామం కాబట్టి.. గుండె పనితీరును వేగంగా మెరుగుపరుస్తుంది. పరిశోధనల ప్రకారం, రన్నింగ్ చేసే వారికి హృదయ సంబంధిత సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. రన్నింగ్ చేసే వ్యక్తులు రన్నింగ్ చేయని వారితో పోలిస్తే 45శాతం తక్కువ గుండె సంబంధిత మరణాలను కలిగి ఉన్నారని తేలింది. అయితే వాకింగ్ చేసే వాళ్లు కూడా దీర్ఘకాలంలో ఇలాంటి ప్రయోజనాలను పొందగలరు.
కేలరీలు బర్న్ చేయడంలో ఏది బెస్ట్
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే రన్నింగ్. ఎందుకంటే రన్నింగ్..వాకింగ్ కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. ఒక సాధారణ వ్యక్తి కిలోమీటరు పరిగెడితే దాదాపు 74 కేలరీలు కరుగుతాయి. అదే దూరాన్ని వాకింగ్ చేస్తే అంటే నడిస్తే కేవలం 56 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. కాబట్టి కేలరీల విషయంలో రన్నింగ్ బెటర్. అయితే నడక కూడా తక్కువ ప్రభావంతో మంచి ఫలితాలనిస్తుంది.
మానసిక ప్రశాంతత కోసం దేనిని ఎంచుకోవాలి
ఒత్తిడిని తగ్గించుకోవడానికి,మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి వాకింగ్ ఒక అద్భుతమైన మార్గం. వాకింగ్ ప్రశాంతమైన, ధ్యానపూరితమైన అనుభూతినిస్తుంది. ఇక రన్నింగ్ విషయానికొస్తే..అది ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. దీంతో రన్నర్స్ హై అనే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కొంతమందికి రన్నింగ్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కాబట్టి వాకింగ్ చాలా ఉత్తమం.
టైం ప్రకారం ఎలా
ఒకవేళ మీకు సమయం తక్కువగా ఉంటే రన్నింగ్ బెస్ట్ ఆప్షన్. ఒక కిలోమీటరు పరిగెత్తడానికి కేవలం 6 నిమిషాలు పడుతుంది. అదే దూరం నడవడానికి దాదాపు 12 నిమిషాలు పడుతుంది.
కీళ్ల నొప్పి ఉంటే ఏది మంచిది
రన్నింగ్.. మీ మోకాళ్లు, తుంటిపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అదే నడక అయితే కీళ్లపై చాలా తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ మీకు కీళ్ల సమస్యలు ఉంటే లేదా తక్కువ ప్రభావంతో కూడిన వ్యాయామం చేయాలనుకుంటే నడక లేదా వాకింగ్ మీకు బెస్ట్ ఆప్షన్
గాయాల భయం ఉందా? ఏది సురక్షితమైనది?
రన్నింగ్ అనేది ఎక్కువ ప్రభావం కలిగిన ఎక్సర్ సైజ్ కాబట్టి మోకాలి నొప్పి వంటి గాయాల ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశముంటది. వాకింగ్ లో ఈ ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి గాయాల గురించి ఆందోళన ఉన్నవారు వాకింగ్ ను ఎంచుకోవడం బెటర్.
ఓవరాల్ గా మీకు ఏది ఉత్తమమైనది
వాస్తవానికి వాకింగ్, రన్నింగ్ రెండింటిలో ఏది బెస్ట్ అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత లక్ష్యాలు, మీ ఆరోగ్యం, మీ ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. పరుగు వేగంగా ఫలితాలనిస్తుంది, కానీ శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. నడక సులభంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా కొనసాగించడానికి అనువైనది. కాబట్టి మీ జీవనశైలికి ఏది సరిపోతుందో ఆలోచించి దానిని క్రమం తప్పకుండా చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications