Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
4 డిగ్రీల చలిలో సమంత ఐస్ బాత్.. ఐస్ బాత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
కొన్నిరోజుల పాటు సినిమా షూటింగ్ కు దూరంగా ఉంటానని ప్రకటించిన సమంత.. ప్రస్తుతం వెకేషన్ లో చిల్ అవుతోంది. ప్రస్తుతం సమంత తన స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ప్రకృతి ఒడిలో సేదదీరుతూ ఎప్పటికప్పుడు తన గురించిన అప్‌డేట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇండోనేషియా వెళ్లినప్పటి నుంచి మరింతగా పోస్టులతో అలరిస్తోంది. రోజుకో వీడియోను షేర్ చేస్తోంది. ఇటీవల జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న కోతి తన వస్తువులను ఎత్తుకుపోయి, తిరిగి తీసుకురాగా.. దాంతో కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటోను కూడా సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. తాజాగా మరో వీడియో పోస్టు చేసింది సామ్.

తాజాగా సమంత రూత్ ప్రభు షేర్ చేసిన వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచింది. వామ్మో అనుకునేలా ఉంది ఆ వీడియో. అందులో ఏముందంటే.. 4 డిగ్రీల చలిలో 6 నిమిషాల పాటు ఐస్ బాత్ చేసినట్లు ఆ వీడియోలో పేర్కొంది సామ్. దీనిపై తన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఐస్ బాత్ థెరపీ మయోసైటిస్ చికిత్సలో భాగమా అని కొందరు ప్రశ్నించారు. కాగా, గతంలో కూడా ఓ సారి సమంత ఐస్ గడ్డలు ఉన్న టబ్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది అని అప్పుడు తన పోస్టుపై రాసుకొచ్చింది.
అయితే ఐస్ బాత్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. ఐస్ బాత్ చేయడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్‌ఫ్లమేషన్, స్వెల్లింగ్‌ను తగ్గిస్తుంది
ఐస్ బాత్ చేయడం వల్ల రక్త నాళాలు నారోగా చేస్తుంది. దీని వల్ల కండరాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అలా వాపు (ఇన్‌ఫ్లమేషన్, స్వెల్లింగ్) తగ్గుతుంది. కంప్రెషన్ సాక్స్ వంటి ఇతర పద్ధతుల కంటే కోల్డ్ బాత్ థెరపీ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, పోస్ట్-ఎక్సర్‌సైజ్ ఇన్‌ఫ్లమేషన్ ను తగ్గించడానికి ఇది ప్రభావవంతమైన పద్ధతి అని పరిశోధనలు చెబుతున్నాయి.
కండరాల నొప్పులను తగ్గిస్తుంది
ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మంట తగ్గడం, నరాల సిగ్నలింగ్ తగ్గడం వల్ల నొప్పి తగ్గుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన నొప్పి బాధిస్తుంటే కాసేపు అలా చల్లని నీటిలో కూర్చుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యాయామం తర్వాత త్వరితగత రికవరీ
ఐస్ బాత్ చేసిన తర్వాత రక్తనాళాలు విస్తరిస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దాని వల్ల కండరాలకు పోషకాలు అందుతాయి. అలాగే పేరుకుపోయిన జీవక్రియ వ్యర్థాలు కూడా తొలగించబడతాయి. వర్కవుట్ తర్వాత ఐస్ బాత్ చేయడం వల్ల కండరాలు త్వరగా రికవరీ అవుతాయి.
కోర్ బాడీ టెంపరేచర్ తగ్గుతుంది
శరీరం వేడెక్కినప్పుడు ఐస్ బాత్ చక్కగా పని చేస్తుంది. కొద్ది సేపటి వరకు ఐస్ బాత్ చేయడం వల్ల కోర్ బాడీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. వ్యాయామం చేసిన తర్వాత శరీరంర వేడెక్కుతుంది. శరీరం నుంచి అధికంగా చెమట బయటకు వెళ్తుంది. దీని వల్ల అలసటగా అనిపిస్తుంది. ఐస్ బాత్ చేయడం వల్ల రిఫ్రెష్ అయినట్లుగా అనిపిస్తుంది.
రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది
ఐస్ బాత్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చల్లని నీరు ఇమ్మర్షన్, లోతైన శ్వాస, ధ్యానం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఐస్ బాత్ చేసే సందర్భంలో రక్త నాళాలు కుంచించుకుపోయి, విస్తరించడం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
వారానికి 4 రోజులు 20 నిమిషాల ఐస్ బాత్ అద్భుతమైన ప్రయోజనాలు ఉంటయాని చెబుతున్నాయని అధ్యయనాలు, ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతుందట. నిరాశ నిస్పృహల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications