Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు చెక్.. ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేయండి చాలు!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఉదయం లేవగానే బ్రెడ్, బటర్ తో సరిపెట్టేయడం, మధ్యాహ్నం నూనె ఎక్కువగా ఉండే బరువైన భోజనం చేయడం, ఇక రాత్రికి బయట జంక్ ఫుడ్ లాగించేయడం... ఇదీ నేటి కాలంలో చాలామంది దినచర్య. ఇలాంటి అధ్వాన్నమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే చిన్న వయసులోనే అధిక బరువు, మధుమేహం, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు చుట్టుముడుతున్నాయి.

వీటన్నింటికీ తోడు గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటివి ప్రతి ఒక్కరినీ నిత్యం వేధించే సాధారణ సమస్యలుగా మారిపోయాయి. రోజంతా కడుపులో మంట, అసౌకర్యంతో ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు. అయితే ఈ ఎసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఉదయం పూట మన దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో ఇక్కడ చూడండి.
పరగడుపున గోరువెచ్చని నీరు
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరానికి ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఈ నీరు శరీరంలోని విష పదార్థాలను సులభంగా బయటకు పంపడమే కాకుండా, మీ జీర్ణవ్యవస్థను ఉద్దీపన చేస్తుంది. తద్వారా రోజంతా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య దరిచేరదు.
యోగాతో ఉదరానికి వ్యాయామం
శారీరక శ్రమ లేకపోవడం వల్లే సగం రోగాలు వస్తాయి. ఉదయం కాసేపు యోగా కోసం కేటాయించండి. ముఖ్యంగా వజ్రాసనం, పవనముక్తాసనం, బాలాసనం వంటి ఆసనాలు వేయడం వల్ల కడుపులో పేరుకుపోయిన గ్యాస్ సులభంగా బయటకు వెళ్లిపోతుంది. ఇవి ఎసిడిటీని తగ్గించి, పొట్టను తేలికగా, ఆరోగ్యంగా మారుస్తాయి.
హెర్బల్ డ్రింక్స్
చాలామందికి ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. కానీ ఖాళీ కడుపుతో కాఫీ, టీలు తాగడం వల్ల ఎసిడిటీ మరింత తీవ్రమవుతుంది. దానికి బదులుగా ఉదయాన్నే జీలకర్ర నీరు, వాము టీ లేదా ధనియాల నీరు వంటి హెర్బల్ డ్రింక్స్ తాగండి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరిచి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జీర్ణశక్తిని పెంచుకోవడానికి అదనపు చిట్కాలు
కేవలం ఉదయం పూట మాత్రమే కాదు, రోజంతా మీ ఆహారం బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకోండి. శరీరానికి సరిపడా నీరు తాగాలి. జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉంటూ, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే రాత్రిపూట కనీసం 8 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్రలేమి కూడా జీర్ణ సమస్యలకు దారితీస్తుందని మర్చిపోకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
