Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
మీరు రోజూ తినే ఈ ఆహారాలు విదేశాల్లో నిషేధించబడ్డాయి..కారణం తెలిస్తే షాక్ అవుతారు!
మనదేశంలో ప్రభుత్వాలకు ప్రజల ఆరోగ్య భద్రతపై ఎంత శ్రద్ధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు ప్రజలు తమకు వేరే పథకాలు వద్దు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తే చాలు రా బాబోయ్ అని మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం అది పట్టించుకోవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కు పోవచ్చు కదా అంటే అక్కడ ఒకటి ఉంటే ఒకటి ఉండదనేది అందరికీ తెలిసిన నిజమే.
ఇదిలాఉంటే, మనదేశంలో మార్కెట్ లో లేదా దుకాణాల్లో దొరికే కల్తీ ఫుడ్, కల్తీ డ్రింక్స్ వంటి వాటి విషయాల్లో కూడా ప్రభుత్వాలకు ఎంత ప్రత్యేక శ్రద్ధ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనం రోజూ కిరాణా షాపులో లేదా సూపర్ మార్కెట్లలో కొనుగోలు చేసే ఎన్నో ఆహార పదార్థాలు మనకు సాధారణంగానే కనిపిస్తాయి. కానీ నమ్మలేని నిజం ఏంటంటే వాటిలో కొన్నింటిని ఇతర దేశాలు తీవ్రమైన ఆరోగ్య, భద్రతా కారణాల వల్ల పూర్తిగా నిషేధించాయి.

విదేశాల్లో బ్యాన్ అయ్యి.. మనం రోజూ తింటున్న ఆహారాలు
MSG ఉన్న ఇన్ స్టంట్ నూడుల్స్
2 నిమిషాల్లో తయారయ్యే ఈ నూడుల్స్ లో రుచి కోసం వాడే మోనోసోడియం గ్లుటమేట్ (MSG), TBHQ వంటి ప్రిజర్వేటివ్స్.. తలనొప్పి, వికారం, నాడీ సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. అందుకే చాలా యూరోపియన్ దేశాలు వీటిపై కఠినమైన ఆంక్షలు విధించాయి.
ఫుడ్ కలర్స్
పిల్లలను ఆకర్షించే రంగురంగుల క్యాండీలు, స్నాక్స్ లో వాడే రెడ్ 40, యెల్లో 5 వంటి కృత్రిమ రంగులు పిల్లలలో హైపర్యాక్టివిటీ (అతి చురుకుదనం), అలెర్జీలకు కారణమవుతాయని తేలింది. అందుకే యూరోపియన్ యూనియన్, యూకేలలో వీటిని నిషేధించారు.
కిండర్ జాయ్, కిండర్ సర్ప్రైజ్
చాక్లెట్ లోపల బొమ్మ ఉండటం పిల్లలకు సరదానే కావచ్చు, కానీ ఇది ప్రాణాంతకం కాగలదు. ఈ చిన్న బొమ్మలు పిల్లల గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉన్నందున అమెరికాలో కిండర్ సర్ప్రైజ్ ను పూర్తిగా నిషేధించారు.
బ్రెడ్ లో పొటాషియం బ్రోమేట్
మెత్తటి, తెల్లటి బ్రెడ్ తయారీలో పిండి త్వరగా పొంగడానికి వాడే పొటాషియం బ్రోమేట్, క్యాన్సర్ కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే యూకే, కెనడా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ దేశాలు దీనిని బేకరీ ఉత్పత్తులలో పూర్తిగా నిషేధించాయి.
మౌంటెన్ డ్యూ
కొన్ని సిట్రస్ సోడాలలో రుచిని స్థిరంగా ఉంచడానికి బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ (BVO) వాడతారు. ఆశ్చర్యకరంగా ఇదే రసాయనాన్ని అగ్నినిరోధకంగా కూడా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోని కొవ్వు కణజాలంలో పేరుకుపోతుందని తేలడంతో జపాన్, యూరోపియన్ యూనియన్ దీనిని నిషేధించాయి.

పెంపకపు సాల్మన్ చేప
ఆకర్షణీయమైన గులాబీ రంగులో కనిపించే పెంపకపు సాల్మన్ చేపలకు కృత్రిమ రంగులు, యాంటీబయాటిక్స్ వాడతారు. వీటిలో క్యాన్సర్ కు కారణమయ్యే PCBలు, డయాక్సిన్ లు అధిక స్థాయిలో ఉంటాయని అధ్యయనాలు తేల్చాయి. అందుకే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు దీనిపై ఆంక్షలు విధించాయి.
జన్యుపరంగా మార్పు చెందిన ఆహారాలు (GMO)
మొక్కజొన్న, సోయా వంటి అనేక ప్రాసెస్ చేసిన ఆహారాలలో GMOలు ఉంటాయి. వీటి దీర్ఘకాలిక ఆరోగ్య, పర్యావరణ ప్రభావాలపై ఆందోళనల కారణంగా ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి దేశాలు వీటిని నిషేధించాయి, కఠినంగా నియంత్రించాయి.
పచ్చి పాలు (పాశ్చరైజ్ చేయని పాలు)
ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని కొందరు నమ్మినా, E. coli, సాల్మొనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరం. అందుకే కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు దీని అమ్మకాలను నిషేధించాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
