Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సబ్జా గింజలు తెగ తినేస్తున్నారా? జాగ్రత్త! సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బంది పెడతాయి
సబ్జా గింజలు(చియా సీడ్స్) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గించడంలో సబ్జా గింజలు చక్కగా పని చేస్తాయని న్యూట్రిషనిస్టులు చెబుతారు. సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సబ్జా గింజలు ఆవాల పరిమాణంలో చిన్నగా, నల్లగా ఉంటాయి. వీటిని నీటిలో లేదా పాలలో నానబెడితే నల్ల విత్తనం చుట్టూ తెలుపు రంగులో ఏర్పడి పెద్దగా మారుతుంది.
వేసవి కాలంలో నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే శరీరం చల్లబడుతుందని అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందని చెబుతారు. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ సబ్జా గింజలను అతిగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సబ్జా గింజలను అతిగా తింటే కలిగే ఆరోగ్య దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ సమస్యలు:
సబ్జా విత్తనాలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. చియా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. రోజులో సబ్జా విత్తనాలను ఒక మోతాదు వరకే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే సమస్యలు తప్పవు. చియా విత్తనాలను అతిగా తింటే విరేచనాలు, ఉబ్బరం, స్టమక్ క్రాంప్స్ వస్తాయి.
రక్తపోటు సమస్యలు:
చియా విత్తనాలు రక్తాన్ని పలుచగా చేస్తాయి. సబ్జా గింజల్లో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లకు రక్తాన్ని పలుచన చేసే లక్షణాలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో సబ్జా విత్తనాలను రోజూ తీసుకుంటే రక్తపోటు సమస్యలు వస్తాయి. ఒకవేళ బీపీ మందులను తీసుకునేవారైతే.. సబ్జా గింజలను తినే ముందు వైద్యులను సంప్రదించాలి.
చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది:
చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చక్కెరను గ్రహించే గట్ సామర్థ్యాన్ని ఆటంకపరుస్తాయి. దాని వల్లల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. సబ్జా గింజల్లోని ఈ గుణాలు డయాబెటిస్ ఉన్న వారికి, ఇప్పటికే మందులు, ఇన్సులిన్లు తీసుకుంటున్న వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే సబ్జా విత్తనాలను మోతాదుకు మించి తీసుకోవద్దు.
రోజూ ఎంత మొత్తంలో సబ్జా గింజలు తినాలి?
చియా విత్తనాలను రోజుకు 1 - 1.5 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఒక మోతాదులో సబ్జా విత్తనాలు తీసుకోవడం వల్ల ఇందులోని ఒమేగా -3 ప్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్ శరీరానికి అందుతాయి.
సబ్జా విత్తనాలను ఎలా తీసుకోవాలి?
చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. నీటిలో నానబెట్టి ఆ నీటిని అలాగే నేరుగా తాగేయవచ్చు. లేదా ఫలుడా లాంటి డిజెర్ట్స్ లో జోడించుకోవచ్చు. ఇతర ఆహారాల్లో సబ్జా గింజలను భాగం చేసుకోవచ్చు.
చియా విత్తనాల పోషకాలు:
చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాల్లో 138 కేలరీలు, 4.7 గ్రాముల ప్రోటీన్, 8.7 గ్రాముల ఫ్యాట్, 9.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, థయామిన్, నియాసిన్ కూడా పుష్కలంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications