Latest Updates
-
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?
కిడ్నీల పనితీరు బాగాలేదని తెలిపే ఐదు హెచ్చరిక సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.!
శరీరంలో మూత్రపిండాలు కీలకమైన భాగం. రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడం, నీటి శాతం, మినరల్స్‌ను బ్యాలెన్స్ చేయడం వంటి కీలక బాధ్యతలను మూత్రపిండాలు నిర్వర్తిస్తాయి. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోయినా, హై బీపీ, లో బీపీ, జీవనశైలిలో మార్పుల కారణంగా మూత్రపిండాలు క్రమంగా బలహీనపడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీలు బలహీనపడ్డాయనే దానికి కొన్ని సంకేతాలు ఉంటాయని.. వాటి లక్షణాలు తేలికపాటిగా అనిపించి ప్రారంభంలో గుర్తించలేమని చెబుతున్నారు. అయినప్పటికీ మీ శరీరంలో కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా కిడ్నీల ఆరోగ్యంపై ఒక అవగాహనకి రావచ్చని.. దీని ద్వారా సమస్యను ముందుగానే గుర్తించి నష్టాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు. అవేంటె చూద్దాం..
ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచీ రాత్రి పడుకునే వరకు మీ శరీరంలో మీరు గమనించే కొన్ని మార్పుల ద్వారా మూత్రపిండాల పనితీరుపై అంచనా వేయవచ్చు. ఒకవేళ మీరు అసాధారణ మార్పులను గమనించినట్లయితే ఆ ప్రారంభ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖం, కళ్ల కింద వాపు
ఉదయం నిద్ర లేవగానే మీ కళ్ల కింద లేదంటే ముఖంపైన వాపు కనిపించినట్లయితే అది మూత్రపిండాల పనితీరుకి ప్రతికూల సంకేతం కావచ్చు. శరీరంలోని అదనపు నీటిని, ఉప్పుని కిడ్నీలు సరిగ్గా తొలగించలేకపోతే శరీరంలో ద్రవాలు నిలిచిపోయి ముఖంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
మూత్ర విసర్జనలో మార్పులు
మూత్ర విసర్జనలో మీరు మార్పులు చూసినట్లయితే కిడ్నీల సమస్య ఉండే అవకాశాలు ఉన్నాయి. తరచుగా మూత్ర విసర్జన, రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంలో నురుగు రావడం, రంగు మార్పు వంటి అసాధారణ లక్షణాలు కనిపించినట్లయితే నిర్లక్ష్యం చేయకూడదు. సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
పాదాలు, చీలమండలలో వాపు
మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లయితే శరీరంలో అదనపు ద్రవం పేరుకుపోతుంది. ఫలితంగా పాదాలు, చీలమండలు, చేతులు వాపునకు గురవుతాయి. ఇలాంటి లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు.

అలసట, నీరసం
మూత్రపిండాలు బలహీనపడినట్లయితే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా అలసట, నీరసం, శక్తి తగ్గిపోవడం వంటి వాటికి దారితీస్తుంది. ఉదయం నిద్ర లేచాక మీకు బరువుగా అనిపించినా, నీరసం, అలసట పెరిగినా నిర్లక్ష్యం చేయకూడదు.
దురద, పొడి చర్మం
కిడ్నీల పనితీరు దెబ్బ తింటే శరీరంలో వ్యర్థ పదార్థాల స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా చర్మంపై దురద, పొడిబారడం, చిరాకు వంటి సమస్యలకు దారి తీస్తుంది.
ఆరోగ్య చిట్కాలు
మూత్రపిండాల ఆరోగ్యం కోసం రోజూ సరైన మోతాదులో నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు మితంగా మాత్రమే తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడి సలహా లేకుండా ఎక్కువ మోతాదులో నొప్పి నివారణ మందులు తీసుకోకూడదు. ప్రతిరోజూ సమతుల్య ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
