సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా బరువు తగ్గాలా? ఈ 10 ఫుడ్స్ ట్రై చేయండి

మనదేశంలో ఊబకాయం అతిపెద్ద సమస్యగా మారింది. సాక్షాత్తూ మన ప్రధానమంత్రి కూడా ఇటీవల పలు సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు. వంటనూనె సహా బరువు తగ్డడంలో సహాయపడే అనేక సూచనలు కూడా చేశారు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ లో బరువు పెరగడం ఈజీ అయిపోతుంది కానీ బరువు తగ్గడం అనేది పెద్ద కష్టంగా మారుతోంది. కొందరయితే రోజుల వ్యవధిలోనే బరువు తగ్గిపోవాలని ఖరీదైన మందులు,ట్రీట్మెంట్స్ వైపు చూస్తున్నారు. ఈ కోవలో ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ఔషధం 'ఓజెంపిక్(OZEMPIC). ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఇంతటి శక్తివంతమైన ప్రభావం చూపే సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలు మన వంటగదిలోనే ఉన్నాయని మీకు తెలుసా?

ప్రముఖ వెయిట్ లాస్ కోచ్ మెలిస్సా..తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా కాస్ట్లీ మెడిసిన్స్ అక్కర్లేకుండానే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఓజెంపిక్ లాంటి ప్రభావాన్ని మన శరీరంపై చూపగలవని తెలిపారు. వాటిని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా బరువును నియంత్రించుకోవచ్చు. ఆమె సూచించిన ఆ 10 అద్భుతమైన ఆహారాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Struggling to Lose Weight These 10 Foods Are Your Natural Ozempic

అవకాడో
చాలామంది ఆవకాడోని చూస్తేనే ముఖం తిప్పేసుకుంటారు. అయితే అవకాడోలను సూపర్‌ ఫుడ్‌గా పరిగణిస్తారు. వీటిలో ఉండే మోనో అన్ ‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ఆకలిని పుట్టించే హార్మోన్లను నియంత్రణలో ఉంచుతాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచ, మిమ్మల్ని గంటల తరబడి కడుపు నిండిన భావనతో ఉంచుతాయి. సలాడ్లపై, టోస్ట్‌ పై లేదా స్మూతీలలో దీనిని చేర్చుకోవడం ఉత్తమం.

చియా గింజలు
చియా గింజల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంటది. వీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి ఉబ్బి ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను నెమ్మదింపజేసి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది.

బంగాళాదుంపలు
బంగాళాదుంపలు తింటే బరువు పెరుగుతారనేది ఒక పెద్ద అపోహ మాత్రమేనని మెలిస్సా చెబుతున్నారు. నిజానికి ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలు అత్యంత సంతృప్తినిచ్చే ఆహారాలలో ఒకటి. ఈ పోషకాలు అధికంగా ఉండే, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. నూనెలో వేయించకుండా చూసుకోవడం ముఖ్యం.

ఓట్స్

ఓట్స్ సహజమైన ఫైబర్ గని. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగించే అనేక హార్మోన్లను విడుదల చేస్తాయి. ఉదయం అల్పాహారంగా ఓట్స్ తీసుకోవడం వల్ల రోజంతా అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది.

Struggling to Lose Weight These 10 Foods Are Your Natural Ozempic

గుడ్లు
గుడ్లు సంపూర్ణ ప్రోటీన్‌ కు అద్భుతమైన మూలం. ఇవి ఆకలి హార్మోన్లను తగ్గించి, తృప్తిని పెంచుతాయి. ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనలో ఉండే పెప్టైడ్‌ లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Take a Poll

గ్రీకు యోగర్ట్
సాధారణ యోగర్ట్ తో పోల్చితే గ్రీకు యోగర్ట్ లో ప్రోటీన్ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమై ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండ, దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

లీన్ మీట్(సన్నని మాంసం లేదా కొవ్వు తక్కువగా ఉండే మాంసం)
చికెన్ బ్రెస్ట్ వంటి లీన్ మాంసాలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్‌ ను తగ్గిస్తుంది. అంతేకాకండా ప్రోటీన్ ‌ను జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ కేలరీలు అవసరం, ఇది జీవక్రియను పెంచడానికి దోహదపడుతుంది.

Struggling to Lose Weight These 10 Foods Are Your Natural Ozempic

చేపలు
సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు అధికంగా ఉండే చేపలలో ప్రోటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని మెలిస్సా తెలిపారు. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు వాపును తగ్గించడమే కాకుండా, ఆకలిని, చిరుతిళ్లపై కోరికలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

బెర్రీలు
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌ బెర్రీ వంటి పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే చక్కెర తక్కువగా, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుతూ, తీపి తినాలనే కోరికను సహజంగా తగ్గిస్తాయి.

ఆకుకూరలు,పీచుపదార్థాలున్న కూరగాయలు
పాలకూర, బ్రకోలీ, క్యాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు, కూరగాయలలో కేలరీలు చాలా తక్కువ. కానీ విటమిన్లు, ఫైబర్, నీటిశాతం అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు నిండుతుంది, కానీ శరీరానికి చేరే కేలరీలు తక్కువ.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion