Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
సమ్మర్ లో పండ్లు తినడానికి సరైన సమయం ఏది? ఈ తప్పులు చేస్తే గ్యాస్, కడుపు ఉబ్బరం!
ఎండాకాలంలో భానుడి భగభగలతో పాటు మనకు వెంటనే గుర్తొచ్చేది రసవంతమైన, చల్లని, తియ్యటి పండ్లు. ఎండల తీవ్రతకు అల్లాడిపోయే మన శరీరానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షించేందుకు పండ్లు ఒక అద్భుతమైన వరం లాంటివి. అయితే పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తింటే వాటిలోని పూర్తి పోషకాలు మనకు అందవని మీకు తెలుసా? పండ్లు తినడమే కాదు, శరీరం వాటిని పూర్తిగా గ్రహించాలంటే సరైన సమయంలో తినడం మరింత ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు.

ఏ సమయంలో పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది?
ఉదయం పూట
పండ్ల నుండి వంద శాతం ప్రయోజనాలు పొందాలంటే ఉదయం పూట మించిన సమయం మరొకటి లేదు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో లేదా మీ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పండ్లను తీసుకోవడం అమృతంతో సమానం. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న మన శరీర జీవక్రియలు ఉదయం చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఫలితంగా పండ్లు చాలా త్వరగా, సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా, ఉదయాన్నే పండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా మిమ్మల్ని ఉల్లాసంగా, యాక్టివ్ గా ఉంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
మధ్యాహ్నం
ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య సమయంలో (మిడ్ మార్నింగ్ స్నాక్ గా) పండ్లు తినడం ఒక బెస్ట్ ఆప్షన్. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కడుపునిండా భారీగా భోజనం చేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాయంత్రం
సాయంత్రం ఆకలి వేసినప్పుడు, నూనెతో చేసిన జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లను ఎంచుకోండి. ఇది ఒక స్మార్ట్ అండ్ హెల్తీ ఛాయిస్. ఇలా చేయడం వల్ల అకాల ఆకలి తీరడమే కాకుండా, శరీరానికి అవసరమైన తేమ అంది ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.

రాత్రి వేళ
రాత్రి ఆలస్యంగా లేదా నిద్రపోయే ముందు పండ్లు తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. నిద్రపోయే సమయానికి మన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆ సమయంలో పండ్లు తింటే జీర్ణం కావడం కష్టమై, నిద్రలేమికి దారి తీస్తుంది.
డాక్టర్ల సూచన
వేసవిలో ఎండల బారి నుండి తప్పించుకోవడానికి నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి, మామిడి, కీరదోస వంటివి ఎక్కువగా మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి శరీరానికి లోపలి నుండి సహజసిద్ధమైన చల్లదనాన్ని ఇస్తాయి.
పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే, ముక్కలుగా కోసుకుని నమిలి తినడమే అన్ని విధాలా బెటర్. జ్యూస్ చేసే ప్రక్రియలో పండ్లలోని అత్యంత ముఖ్యమైన పీచు పదార్థం(ఫైబర్) పూర్తిగా నశించిపోతుంది. కాబట్టి పండ్లను పూర్తిగా నమిలి తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
