Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
High BP: ఫోన్లో తెగ మాట్లాడుతున్నారా? 30 నిమిషాల కంటే ఎక్కువైతే ఈ సమస్య తప్పదు
సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఫోన్ లేకుండా ఏ పని కూడా జరగని పరిస్థితి. కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టినా ఎంతో కోల్పోయినట్లుగా ఫీలైపోతుంటారు కొంతమంది. కొందరు అదే పనిగా ఫోన్ స్క్రీన్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటారు. మరికొందరు గంటల తరబడి ఫోన్లలో సొల్లు కబుర్లు చెబుతుంటారు.

విపరీతమైన సెల్ ఫోన్ వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలిసిన విషయమే. అదే పనిగా ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల కంటి సమస్యలు, నిద్ర సమస్యలు, మెడ నొప్పులు సహా చాలా సమస్యలు వస్తాయని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు.
ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడితే సమస్యే:
కొంతమంది ఫోన్ పట్టుకుని చెవి దగ్గర పెట్టారంటే గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. ఫోన్ స్క్రీన్ తెగ చూడటం వల్ల సమస్య కానీ ఫోన్ మాట్లాడితే ఏమవుతుందని ఎదురు ప్రశ్నిస్తుంటారు. అయితే ఫోన్లో ఎక్కువగా మాట్లాడేవారికి దిమ్మతిరిగే న్యూస్ అందించారు చైనా పరిశోధకులు.
చైనాలోని గ్వాంగ్ జౌలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన అధ్యయన రచయిత ప్రొఫెసర్ జియాన్‌హుయ్ క్విన్్ ఓ పరిశోధన చేపట్టారు. దీని ప్రకారం సెల్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడే వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. వారానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు సెల్ ఫోన్లో మాట్లాడే వారిలో హైబీపీ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరించారు.
రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల బీపీ:
సెల్ ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తాయి. కానీ ఎక్కువ సేపు వీటికి గురైతే మాత్రం ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండెపోటు, పక్షవాతానికి ఈ హైబీపీయే కారణం. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
యూకే బయోబ్యాంక్ నుండి 37 నుండి 73 సంవత్సరాల వయస్సు గల మొత్తం 2,12,046 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరంతాగ గత 12 సంవత్సరాలుగా సెల్ ఫోన్ వాడుతున్నారు. సంవత్సరంలో ఎంత కాలం పాటు దాదాపుగా ఫోన్ మాట్లాడారు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడారా, ఇయర్ ఫోన్స్ వాడారా అనేది పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు.
12 సంవత్సరాల తర్వాత అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశీలించినప్పుడు 7 శాతం మందిలో అధిక రక్తపోటును గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువ సేపు ఫోన్లో సంభాషించిన వారిలో 12 శాతం, వారానికి 30 నుండి 59 నిమిషాలు ఫోన్లో మాట్లాడే వారిలో 13 శాతం అధిక రక్తపోటు ముప్పు పెరగొచ్చని శాస్త్రవేత్తలు వెలలడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











