Latest Updates
-
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే..
అధికంగా చెమట కారుతోందా? తీవ్రమైన ఆ వ్యాధికి ఇది సంకేతమే!
ఎండాకాలం బయటకు వెళ్లినా, కాసేపు వ్యాయామం చేసినా లేదా కష్టపడి పనిచేసినా ఒళ్లంతా చెమటలు పట్టేయడం మనం నిత్యం చూసేదే. చాలామంది చెమటను ఒక చికాకుగా, కేవలం వేడి లేదా అలసటకు సంకేతంగా మాత్రమే భావిస్తారు.
కానీ మన శరీరంలో జరిగే అద్భుతమైన ప్రక్రియల్లో ఇదీ ఒకటి. చెమట పట్టడం అనేది కేవలం నీరు బయటకు రావడం కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజమైన రక్షక కవచం.

శరీరానికే సొంతమైన న్యాచురల్ ఏసీ
మెడికల్ సైన్స్ ప్రకారం చెమట వెనుక ఒక గొప్ప శాస్త్రీయ యంత్రాంగం దాగి ఉంది. దీనినే థర్మోరెగ్యులేషన్(ఉష్ణ నియంత్రణ) అని పిలుస్తారు. మన ఇళ్లలో ఏసీ ఎలాగైతే గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తుందో, మన శరీరం కూడా తనను తాను చల్లబరుచుకోవడానికి చెమటను ఒక ఏసీలా ఉపయోగిస్తుంది.
ఎండలో ఉన్నప్పుడు లేదా వాతావరణంలో వేడి పెరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అప్పుడు వెంటనే చర్మంలోని చెమట గ్రంథులు అప్రమత్తమై నీరు, ఉప్పుతో కూడిన ద్రవాన్ని బయటకు పంపుతాయి. ఈ ద్రవం చర్మంపై నుండి ఆవిరైనప్పుడు, ఆటోమేటిక్‌గా శరీరంలోని వేడి తగ్గిపోయి మనకు చల్లదనం కలుగుతుంది.
శక్తికి, చెమటకు ఉన్న లింక్ ఏంటి?
చెమటకు, మన జీవక్రియకు, అలాగే గుండె స్పందన రేటుకు విడదీయరాని సంబంధం ఉంది. మనం పరుగెత్తినప్పుడు లేదా జిమ్ లో కష్టపడినప్పుడు, మన శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఈ క్రమంలో లోపల విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడిని అలాగే వదిలేస్తే ప్రమాదం. కాబట్టి ఆ వేడిని బయటకు పంపి, శరీరం ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడేదే ఈ చెమట.
ఎప్పుడు భయపడాలి?
అయితే ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. చెమట పట్టడం ఆరోగ్యమే అయినప్పటికీ, అది శృతి మించితే మాత్రం ఒక అంతర్గత అనారోగ్యానికి సంకేతం కావచ్చు. ఎండ లేదు, వ్యాయామం చేయలేదు.. అయినా సరే ఏసీ గదిలో కూర్చున్నా బట్టలు తడిసిపోయేలా చెమట పడుతోందా? చేతులు, అరికాళ్లలో ఎప్పుడూ చెమటలు వస్తూనే ఉన్నాయా? అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి.
వైద్య పరిభాషలో దీనిని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రంగా కుంగిపోతారు. నలుగురిలోకి వెళ్లాలన్నా, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా భయపడిపోతారు. ఈ పరిస్థితి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, సామాజికంగా ఇబ్బంది పడేలా చేస్తుంది.
కారణాలు - డాక్టర్ సలహా
ఇలా కారణం లేకుండా అతిగా చెమట పట్టడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది వంశపారంపర్యంగా రావచ్చు. మరికొన్నిసార్లు శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ లేదా మనం వాడే కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఏ కారణం లేకుండా చెమట నీళ్లలా కారుతుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
