Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
రాత్రి బొడ్డులో ఇది 2 చుక్కలు వేస్తే జరిగే అద్భుతం ఏంటో తెలుసా?
మన శరీరానికి నాభి అంటే బొడ్డుని ప్రాణకేంద్రంగా చెబుతుంటారు. బొడ్డు నుండే వేలాది నాడులు శరీరం నలుమూలలకూ విస్తరించి ఉంటాయి. అందుకే బొడ్డు దగ్గర చేసే చిన్న ట్రీట్మెంట్ కూడా మొత్తం శరీరంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతారు. అయితే నాభిలో కేవలం రెండు చుక్కల రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల మనం ఊహించని సౌందర్య, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలుసా?
శతాబ్దాలుగా సౌందర్య సాధనాల్లో రోజ్ వాటర్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కళ్ళకు చల్లదనాన్ని, చర్మానికి మెరుపును ఇవ్వడానికి మనం దీనిని తరచుగా వాడుతుంటాం. కానీ ఈ అద్భుత ద్రవాన్ని కేవలం ముఖానికి మాత్రమే పరిమితం చేస్తుంటారు చాలామంది. బొడ్డులోరోజ్ వాటర్ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.

మొటిమలకు స్వస్తి, మచ్చలకు వీడ్కోలు
ముఖంపై మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో విసిగిపోయారా? అయితే నాభిలో రోజ్ వాటర్ వేయడం వల్ల అది శరీరంలోని అధిక వేడిని నియంత్రించి, చర్మంలోని మంట, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మానికి లోపలి నుండి తేమను అందించి క్రమంగా మచ్చలను మాయం చేయడంలో సమాయపడుతుంది.
సూర్యుని ప్రతాపానికి చల్లని ఉపశమనం
ఎండాకాలంలో వడదెబ్బ, చర్మం నల్లబడటం వంటివి సాధారణంగా వచ్చే సమస్యలు. అయితే రోజ్ వాటర్ లో ఉండే సహజమైన శీతలీకరణ గుణాలు చర్మానికి ఉపశమనాన్నిస్తాయి. రోజూ రాత్రి బొడ్డులో రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల ఎండకు కమిలిన చర్మానికి లోపలి నుండి సాంత్వన లభించి, చర్మం నల్లబడటం నెమ్మదిగా తొలగిపోతుంది.
యవ్వన కాంతి
ఏజ్ పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు, సన్నని గీతలు రావడం సహజం. రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. నాభి ద్వారా దీనిని గ్రహించడం వల్ల ముఖ చర్మంలోని సాగుదల తగ్గి, కాంతివంతంగా మెరుస్తుంది.
కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గడానికి
కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా ముఖం కళాహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుందా? రోజ్ వాటర్ ఒక అద్భుతమైన క్లెన్సర్ గా పనిచేస్తుంది. నాభిలో దీనిని వాడటం వల్ల శరీరంలోని తేమ సమతుల్యమై, చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి, సహజమైన మెరుపును అందిస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గడానికి కూడా ఇది దోహదపడుతుంది.

సుఖమైన నిద్రకు
రోజ్ వాటర్ చల్లదనం కేవలం చర్మానికే కాదు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. నాభిలో వేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనివల్ల రోజంతా పడిన అలసట తీరి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది సుఖమైన నిద్రకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి?
రాత్రి పడుకునే ముందు ఒక శుభ్రమైన కాటన్ బాల్ సహాయంతో 2-3 చుక్కల స్వచ్ఛమైన రోజ్ వాటర్ ను మీ బొడ్డులో వేసి అలాగే వదిలేయండి. రాత్రంతా అది తన పని తాను చేసుకుపోతుంది. ఎల్లప్పుడూ రసాయనాలు లేని, సహజమైన, నాణ్యమైన రోజ్ వాటర్ ను మాత్రమే ఎంచుకోండి. మీ చర్మం సున్నితమైనది అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఏదైనా దురద లేదా చికాకు అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications