Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఒక్క ఫ్లోర్ మెట్లు ఎక్కగానే రొప్పుతున్నారా? డాక్టర్ చెప్పిన ఈ షాకింగ్ నిజం తెలిస్తే..వీడియో చూడండి
సాధారణంగా మెట్లు ఎక్కుతుంటే కొందరికి అలసట వస్తుంది. ఒక్క ఫ్లోర్ ఎక్కగానే అమ్మో అయ్యో అని రొప్పుతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. హార్ట్ బీట్ పెరిగిపోతుందటది. అయితే మీకు కూడా ఇలాంటి అనుభం ఎదురైందా? ఏదో అలసట వల్లనో లేక ఊబకాయం కారణంగానే మనకి ఇలా అనిపిస్తందేమో అని అనుకున్నారంటే మీరు పెద్ద పొరపాటు చేసినట్లే. వాస్తవానికి ఇలా మీకు అనిపిస్తే దాని వెనుక ఓ ముఖ్య కారణం ఉంటుంది..అదే మీ శరీరంలో ముఖ్యమైన పోషకాల కొరత.
మన శరీరంలో ముఖ్యమైన పోషకాల లోపం ఉన్నప్పడే మనకు మెట్లు ఎక్కుతున్నప్పుడు అలసిపోయినట్లు, మూర్ఛపోయినట్లు ఇలా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణురాలు రమితా కౌర్ దీనికి సంబంధించి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో షేర్ చేశారు. ఏ పోషకాల కొరత శరీరంలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది,దీనికి తీసుకోవాల్చిన చర్యల గురించి ఆమె తన వీడియోలో సూచించారు. ఆమె ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

మన శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ లేదా ఐరన్ లోపం ఉన్నప్పుడు,ఊపిరితిత్తులు వీక్ గా ఉన్నప్పుడు, బీ 12 విటమిన్ D వంటి న్యూట్రిషనల్ కొరత ఉన్నప్పుడు, పేలవమైన స్టామినా,టాక్పిన్ నిర్మాణం సరిగ్గా లేనప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు అలసట,ఊపిరి ఆడకపోయినట్లు అనిపిస్తుంటదని రిమితా కౌర్ చెప్పారు. అయితే దీనికి పరిష్కారాలను కూడా ఆమె సూచించారు.
ఈ చిట్కాలతో ఆ ప్రాబ్లమ్స్ కి చెక్
హిమోగ్లోబిన్ అనేది శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడానికి పనిచేసే ఒక ప్రత్యేక రకం ప్రోటీన్. దాని లోపం ఉన్నప్పుడు శరీరంలోని కండరాలు, అవయవాలు అవసరమైన మొత్తంలో ఆక్సిజన్‌ను పొందలేవు. ఫలితంగా తేలికపాటి నడక అయినా లేదా మెట్లు ఎక్కడం వంటివి అలసట, శ్వాస ఆడకపోవడం, బలహీనతకు దారితీస్తుంది. హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు బీట్‌రూట్, ఉసిరి జ్యూస్ తో మీ రోజుని ప్రారంభించాలని రమితా కౌర్ తెలిపారు.
రోజూ తీసుకునే ఆహారంలో కరివేపాకు,నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష ఉండేలా చూసుకోవాలని,ఇవి అలసట,ఐరన్ లోపాన్ని తగ్గిస్తుందని రమితా కౌర్ చెప్పారు. రోజూ 5 నిమిషాల పాటు అనులోమ్ విలోమ్(యోగాలో ప్రాణాయామ టెక్నిక్), భ్రమరి ప్రాక్టీస్ చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని రమితాకౌర్ సూచించారు.
భోజనంలో చిరుధాన్యాలు(మిల్లెట్స్),నెయ్యిని చేర్చుకోవాలని..ఇది శక్తిని పెంచుతుందని ఆమె తెలిపారు. అయితే కొందరు భోజనం తినడం మానేస్తుంటారని,అయితే ఇలా చేయడం వల్ల మీ ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయని ఆమె తెలిపారు. మీ శరీరం బలహీనంగా లేదు..కేవలం పోషకాహార లోపంతో ఉందని గుర్తిస్తే చాలని ఆమె తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications